రేవంత్ రెడ్డికి నేతకాని సంఘం వినతి

ములుగు

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేసిన తెలంగాణ నేతకాని (మహర్ )కుల హక్కుల పరిరక్షణ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు

సానుకూలంగా స్పందించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
మన ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ

ములుగు పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందించారు

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారితో జాడి రాంబాబు మాట్లాడుతూ

👉 ఏజెన్సీ ప్రాంతంలో తరతరాల నుండి ఆదివాసులతో మమేకమై మా నేతకానిజాతి(దళితులు) జీవిస్తున్నారు.
◆ పూర్వకాలంలో మా నేతకాని జాతి నేత నేసి( దొడ్డునేత)బట్టలు తయారుచేసి ఆదివాసి ప్రజలకు మరియు ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఇతర కులాల ప్రజలకు అందించే వారం.

● ఆదివాసీల మాదిరిగానే మేము కూడ అటవీ ఉత్పత్తుల పైన ఆధారపడి జీవనాన్ని సాగించే వారం.

● కానీ ప్రపంచీకరణ యాంత్రికరణ మూలంగా మేము నేత నేయడం(దొడ్డునేత) ద్వారా తయారైనటువంటి బట్టలకు ఆదరణ కోల్పోయి, మా నేతకాని జాతి కుల వృత్తిని కోల్పోయింది.

● నేడు దిక్కుతోచని స్థితిలో ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం.

● కానీ నేడు పుట్టిన గడ్డపై ఎటువంటి హక్కు లేకుండా విద్య, ఉద్యోగ రాజకీయ అవకాశాలు లేకుండా అనాధలుగా బ్రతుకుతున్నాం.

● ఎన్నో ప్రభుత్వాలు మారిన ఎంతోమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా పని చేసిన మా నేతకానిప్రజల జీవితల లో మార్పు రాలేదు.

● నేతకానిలు వ్యవసాయం చేసుకుంటున్న సాగు భూములకు గాని ,పోడు భూములకు గాని ఎటువంటి హక్కులు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయినటువంటి రైతు బీమా,రైతు బంధు, దళిత బంధు, విత్తన సబ్సిడీమరియు బ్యాంకు రుణాలు మొదలగు పథకాలు మా నేతకాని జాతికి అందడం లేదు

● కావున కేంద్రంలో,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా నేతకాని జాతి అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహకరించి మా అభివృద్ధికి బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

మా డిమాండ్స్::

👉★ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులతో మమేకమై జీవిస్తున్న నేతకాని/ మహర్లకు సాగు,పోడు భూములకు భూ హక్కు పత్రాలు ఇవ్వాలి

👉★ తరతరాల నుండి ఏజెన్సీ ప్రాంతంలో నేతకానిలకు 1/ 70 యాక్ట్ సడలింపు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.

👉★ ఐటీడీఏ తరహాలో ఏజెన్సీ (దళితుల) నేతకనిల అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలి.

👉★ ఏజెన్సీ ప్రాంతంలో నేతకానిలు సాగు చేసుకుంటున్నా భూములకు అక్కుపత్రాలు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయినా రైతు బీమా, రైతు బంధు, విత్తన సబ్సిడీ, బ్యాంకు రుణాలు అందడం లేదు కావున ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అవకాశం కల్పించాలి

👉★ ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులుగా గుర్తించి ఎస్టీలతో పాటు సమాన హక్కులు కల్పించాలి.

👉★ సుప్రీంకోర్టు జిఓ3 రద్దు తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ ఏజెన్సీ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.

👉★ ఏజెన్సీ ప్రాంతాలలోని నేతకాని గూడాలను (దళిత గుండెలను)గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసి. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం లక్ష్మి కాంత్, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రాజు, భీం సైనిక్ దల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్, జిల్లా నాయకులు సునార్కని రాంబాబు , కొండగొ ర్ల మోహన రావు, కుమ్మరి నర్సింహులు, దుర్గారావు , కుమార్, నరేష్, సురేందర్, దశంత రావు తదితరులు పాల్గొన్నారు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest