రోడ్డుపై అమ్మాయిని కొట్టిన యువకుడు … ఎందుకు కొట్టావని నిలదీసిన హీరో నాగ శౌర్య

◾ || రోడ్డుపై అమ్మాయిని కొట్టిన యువకుడు … ఎందుకు కొట్టావని నిలదీసిన హీరో నాగ శౌర్య ||

▪️టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సంఘటన నిలదీసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

▪️కారులో వెళుతున్న నాగశౌర్యకు నడిరోడ్డు పై ఒక అబ్బాయి ఒక అమ్మాయి పై చెయ్యి చేసుకోవడం చూశాడు.

▪️వెంటనే కారు దిగి ఆమె పై ఎందుకు చెయ్యి చేసుకున్నావు అంటూ నిలదీశాడు.

▪️ఆమెకు క్షమాపణ చెప్పాలి అంటూ ఆ అబ్బాయిని కోరాడు. కానీ అతను మాత్రం క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు.

▪️ఆమె నా లవర్ నా ఇష్టం అంటూ బదులివ్వడంతో నాగశౌర్య అతని చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్పే వరకు వదిలేదు లేదంటూ చెప్పాడు.

▪️ఈ సంఘటనకి సంబంధించిన వీడియో బయటకి రావడంతో, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవ మర్యాదలకు హ్యాట్సాఫ్ అంటున్నారు.

▪️ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల పనులు చేస్తున్న తరుణంలో ఇది నిజామా? ప్రాంకా? అని కొందరు కన్‌ఫ్యుజ్ అవుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest