వాణి జయరాం మృతి పట్ల హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం

 

సినీ నేపథ్యగాయకురాలు శ్రీమతి వాణి జయరాం గారి మృతి పట్ల హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి సంతాప సందేశం.

సినీ నేపథ్యగాయకురాలు శ్రీమతి వాణి జయరాం గారు వివిధ భాషల్లో ప్రావీణ్యం కలిగి, వివిధ భాషలలో వేయి సినిమాలలో 20,000 పాటలకు పైగా నేపధ్యగానం చేశారని, వారి మధురమైన కంఠస్వరంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారని, హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారిని కొనియాడారు. శ్రీమతి వాణి జయరాం ,  ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, కే. విశ్వనాధ్ , కళా మాధవన్, ఏఆర్ రెహమాన్ సాహిత్యంలో అనేక పాటలు పాడారని, పండిట్ రవిశంకర్ తో కలిసి మీరా చలనచిత్రంలో అద్భుతమైన ఆమె కంఠస్వరంతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారని, శ్రీమతి వాణి జయరాం  భారతీయ సాంప్రదాయాలకు, భారతీయు సంస్కృతికి నిలువుటద్దం లాంటివారని, వారి మృతి భారతీయ సంగీత, సాహిత్యానికి తీరని లోటు అని బండారు దత్తాత్రేయ గారు పేర్కొన్నారు.

శ్రీమతి వాణి జయరాం  మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిప్రసాదించాలని, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు శ్రీ బండారు దత్తాత్రేయగారు తెలియజేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest