విపక్షాల ఐక్యపోరాటం-టార్గెట్ మోదీ సర్కార్

 

  • ఏకతాటిపైకి 18 పార్టీలు

 

న్యూఢిల్లీ :

ప్రజాస్వామ్యంపై దాడి చేయడం సహా పాటు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 18ప్రతిపక్ష పార్టీలు ఐక్యపోరాటం చేయనున్నాయి. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ సర్కార్‌ బెదిరింపు రాజకీయాలను ఐక్యంగా ఎదుర్కొవాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించనున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత విధించటాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం సైతం నిరసన కొనసాగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో 18 పార్టీల సభాపక్ష నేతలు పాల్గొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌, డీఎంకే, NCP, JDU, BRS, టీఎంసీ, ఆమ్ ఆద్మీ, CPM, CPI, MDMK, KC, RSP, RJD, జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, IUML, VCK, ఎస్పీ, జే ఎం ఎం నేతలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest