విశాఖ జిల్లాలో IAS ల బదిలీ

విశాఖ

కృష్ణాజిల్లాగా బదిలీ అయిన గ్రేటర్ కమిషనర్
—-జీవీఎంసీ కమిషనర్ గా సీఎం సాయి కాంత్ వర్మ
—-పాడేరు ఐటిడిఎ పిఓగా అభిషేక్
—విశాఖ కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా ఆనంద్
—అనకాపల్లి జెసి కల్పనకుమారికి సీతంపేట ఐటిడీఏ పిఓగా బదిలీ
విశాఖపట్నం,: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నత అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు ఐఏఎస్ అధికారులను మార్పు చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న పి. రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్ గా నియమించింది. వైయస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సీఎం సాయి కాంత్ వర్మను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా ఓ. ఆనంద్ ను, ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ సర్వే అండ్ ల్యాండ్స్ కమిషనర్ గా బదిలీ చేసింది. అలాగే పాడేరు సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వి. ఆభిషేక్ ను పాడేరు ఐటిడిఏ పిఓ గా నియమిస్తూ ఉత్తరంలో పేర్కొంది. అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కల్పనా కుమారిని సీతంపేట ఐటిడిఏ పిఓగా నియమించింది. అయితే ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా రాజాబాబు బాధ్యతలు చేపట్టి అతి తక్కువ కాలంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్గా బదిలీ కావడం విశేషంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest