శ్రీరామచంద్రుడుకి మాట ఇచ్చి తప్పినోడు..ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాడా?

భద్రాచలం:

“భద్రాచలంలో రూ. 100 కోట్లతో శ్రీరాముడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాటిచ్చాడు. ఏం పోయే కాలం వచ్చిందో ఆ హామీని కూడా గాలికొదిలేశాడు. శ్రీరామచంద్రుడుకి కూడా మాట ఇచ్చి తప్పినోడు.. ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాడా?” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 8వరోజు సారపాక నుంచి భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వరకు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. విభజించు పాలించి నినాదంతో బీజేపీ పాలన సాగిస్తోంది. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ భారతో జోడో యాత్ర చేశారు. శ్రీరాముడు నడయాడిన ప్రాంతం ఇది. బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా ఇంత గొప్ప చరిత్ర కలిగిన భద్రాచలం గుర్తింపు కోల్పోయింది. అనాటి నిజాం నుంచి నేటి పాలకుల వరకు శ్రీరాముడికి తలంబ్రాలు ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఏమీ పోయే కాలం వచ్చిందో కేసీఆర్ శ్రీరామునికి తలంబ్రాలు ఇవ్వడానికి రావడం లేదు. రూ. 100 కోట్లతో శ్రీరాముడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న హామీ గాలికొదిలేశారు. గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ మోసం చేశాడు. వరద బాధితులకు ఇస్తామన్న 10వేలు కూడా ఇవ్వలేదు. శ్రీరాముడికి మాట చెప్పి మోసం చేసినోడు బాగుపడతాడా? సీతారామ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం అందలేదు. సీతారామ ప్రాజెక్టు వద్ద నిర్మించే పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వలేదు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియడం లేదని రైతులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ సీఎం ఆయ్యాక 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. వాటి రూ. 17 లక్షల కోట్లు. 5 లక్షల 29 వేల కోట్లు అప్పులు తెచ్చారు. భద్రాచలం అసెంబ్లీకి 20వేల కోట్లు రావాలి. రాముల వారి గుడికి కనీసం వంద కోట్లు ఇవ్వలేక పోయారు. లేదు. సన్యాసి పినపాక ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఎక్కడో గాడిదలు కాసే నిన్ను రెండుసార్లు ఎంఎల్ఏ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా. భద్రాచలం నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నయో గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో అక్కడే బీఆరెస్ ఓట్లు అడగాలి. ఈ సవాలుకు సిద్ధమా? ఈ సవాల్ కు కేసీఆర్ సిద్ధమా? దీనికి సిద్ధపడితే బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కూడా రాదు. గ్రౌండ్ లో కాంగ్రెస్ లేదని బీజేపీ పిచ్చి కూతలు కూస్తున్నారు. బీజేపీ నాయకులు ఎంత, మీ పార్టీ ఎంత. బొడి గుండ మీద బొచ్చు వచ్చేది లేదు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు. భద్రాచలం వచ్చి చూడండి కాంగ్రెస్ ఉందో లేదో తెలుస్తుంది. కొత్త సంవత్సరం 2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తాం. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ రైతుకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తాం. కౌలు రైతులకు, రైతు కూలీలకు, భూమిలేని వారికి రూ. 15 వేల సాయం అందిస్తాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. పేదల కోసం రూ. 500 లకే సిలిండర్ అందిస్తాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇన్నీ మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రాహుల్ గాంధీ వంటి నాయకుడే గ్రామాల్లో తిరిగారు. మనం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాలకు వెళదాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దాం. కేసీఆర్ సీఎం అయ్యాకనే 7 మండలాలు ఆంధ్రాలో కలిపారు. భద్రాచలాన్ని మూడు ముక్కలు చేసినోన్ని మూడు లీటర్ల లోతులో బొంద పెట్టాలి.
సీతారామచంద్రస్వామి దర్శనం
సభ అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదం ఆశీర్వచనాలు అందించారు.

భద్రాచలం కాంగ్రెస్ కంచుకోట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
భద్రాచలం ఎప్పుడూ కాంగ్రెస్ కు కంచుకోటనే. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ భద్రాచలంకు చేసిందేం లేదు. భద్రాచలాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాలేజీలు, ఆసుపత్రులు.. చివరకు గోదావరి నదిపై బ్రిడ్జి కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ హయాంలో 125 కోట్లతో భద్రాచలానికి మంచినీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతకాలని అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రెస్. 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. దశాబ్ద కాలంగా నీళ్లు రాలేదు.. నియామకాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలి. ఏడు మండలాలు బిల్లులో పెట్టకపోయినా దొంగచాటుగా బీజేపీ ఆర్డినెన్స్ ఇచ్చింది. ఉన్న భద్రాచలాన్ని కూడా కేసీఆర్ మూడు ముక్కలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. వరంగల్ డిక్లరేషన్ ను తప్పకుండా అమలు చేస్తాం.

మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది : హనుమంతరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే రాలేదు. తెలంగాణ తెచ్చింది మేము. ఇచ్చింది మేము. ఈ జనాన్ని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది.. మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలోనే నెంబర్ వన్ అంటున్న కేసీఆర్.. వైన్ షాపులు పెంచడంలో నెంబర్ వన్ అయ్యారు. నల్ల ధనం వెనక్కి తెస్తామన్న మోదీ 2 వేల నోటు తెచ్చి మరింత పెరిగేలా చేశారు. హాంగ్ వస్తుందని చెప్పి కోమటిరెడ్డి కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారు. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దు. వీలైతే మేమున్నామని ధైర్యం చెప్పండి. మాలో విభేదాలు లేవు.. అందరం కలిసే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest