ముంబై
షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ”జవాన్” లో అల్లు అర్జున్ నటించబోతున్నారని వార్తలు ముంబై లో గుప్పుమంటున్నాయి. జవాన్ సినిమాలో అతిధి పాత్ర కోసం సినిమా మేకర్స్ అల్లు అర్జున్ ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు అల్లు అర్జున్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ పాత్ర కూడా పుష్ప సినిమాలోని పాత్రను పోలి ఉంటుందని ముంబై సినీ మార్కెట్ టాక్. ఒకవేళ ఈ ప్రతిపాదనకు అల్లు అర్జున్ ఒప్పుకుంటే షారుఖ్ ఖాన్ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది.పుష్ప సినిమా తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా భారీగా కలెక్షన్లు రాబట్టడంతో హిందీ ప్రేక్షకుల్లో కూడా అల్లు అర్జున్ అంటే క్రేజ్ ఏర్పడింది. దీంతో షారుఖ్ సినిమాలో అల్లు అర్జున్ తో ఓ కీలకమైన పాత్ర చేయించాలని భావిస్తున్నారట.
Post Views: 120