షార్ నుండి నేడే నింగిలోకి దూసుకుపోనున్న SSLV D-2 రాకెట్

 

  • మరో ప్రయోగానికి వేదిక కానున్న షార్
  • ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చిన్న ఉపగ్రహవాహక నౌక(SSLV D-2)ద్వారా 3 ఉపగ్రహాలు
  • నింగిలోకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో),ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి

శ్రీహరికోట :

ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఎస్ఎస్ఎల్వి డి2 అనే చిన్న తరహా రాకెట్ ద్వారా మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ తెల్లవారుజామున 2.48 నిమిషాలకు మొదలైంది. ఈ కౌంట్ డౌన్ 6.30 గంటలపాటు కొనసాగి ఈ ఉదయం 9 గంటల 18 నిమిషాలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఎస్ ఎస్ ఎల్ వి డి-2 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల ఇ వో ఎస్-07, చెన్నై స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు రూపొందించిన 8.7కిలోల బరువు వున్న ఆజాది శాట్-2 అనే ఉపగ్రహాన్ని, యు ఎస్ ఏ అంటారిస్ కు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్ -1అనే ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెట్టనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest