సమ్మక్క సారక్క ట్రస్ట్ బోర్డ్ ఆదిమ తెగలతోనే ఏర్పాటు చేయాలి

మేడారం

మేడారం సమ్మక్క సారక్క తల్లుల ట్రస్ట్ బోర్డ్ లో ఆదిమ తెగలతోనే ఏర్పాటు చేయాలి.  ఆదివాసి సంక్షేమ పరిషత్
(ది 06-02-2023 సోమవారం) నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ ఆదేశాలనుసారంగా  మేడారం సమ్మక్క సారక్క తల్లుల ట్రస్ట్ బోర్డును ఆదిమ తెగల తోనే ఏర్పాటు చేయాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్ మాట్లాడుతూ శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల వ్యవహారాలతో సాగుతున్నటువంటి ఈ యొక్క జాతరలో ఆదివాసుల మనోభావాలు ఇమిడి ఉన్నాయని అన్నారు. దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలనుకున్న అంశంలోని ఈ యొక్క ట్రస్ట్ బోర్డు ఆదివాసి సమాజంతో మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలతో ఏర్పడినటువంటి ఈ యొక్క జాతర ఆదివాసుల గుర్తింపునకు సింహద్వారం. ఇలాంటి జాతరను ట్రస్టు బోర్డు పేరుతో హిందుత్వంలో కలపడం వల్ల ఆదివాసుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్కలు భవిష్యత్తు ఆదివాసి తరాలకు అందనంత దూరంలో ఉంటాయని తప్ప సమ్మక సారక్క తల్లులు ఆదివాసుల ఇలవేల్పులని భవిష్యత్తు సమాజం పుస్తకాల్లో చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల వనదేవతలకు సంబంధించి ఆదివాసుల తల్లులు శ్రీ సమ్మక్క సారక్కల కోసం ఆదివాసీల సంరక్షణలోనే జాతర జరిగే విధంగా ప్రత్యేక ఆదివాసుల సమ్మక్క సారక్క తల్లుల జాతర బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మా మనోభావాలను ప్రతిబింబిస్తాయి. అలాగే మా సమ్మక్క సారక్క తల్లుల జాతరను ఆదివాసుల జాతరగా పిలవబడుతుంది ఈ సమ్మక్క సారక్క జాతరను ఆదివాసుల జాతర గాని కొనసాగించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి చేల శమంతకమణి, ఏటూరు నాగారం మండల అధ్యక్షురాలు పాయం భారతి, ఉపాధ్యక్షురాలు సోలం అరుణకుమారి, ప్రధాన కార్యదర్శి యాలం రామలక్ష్మి బండ రమ్య, వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణబాబు, చంటి, నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest