సర్కారు బడులలో సకల వసతులు

 

(పాలకుర్తి , ఫిబ్రవరి 01)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతున్నాయని, సర్కారు బడులలో సకల వసతులు ఏర్పాటు అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చి, కరెంటు వచ్చి, వ్యవసాయం పెరిగిందని తద్వారా భూముల ధరలు పెరిగాయని, రైతుల గౌరవం పెరిగిందని తెలిపారు.
ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చి, మరో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మీ కేసీఆర్కె దక్కుతుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం 7289 కోట్ల రూపాయలతో చేపట్టినమన ఊరు – మన బడి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా దేవరుప్పల మండలం, లక్ష్మణ్ తండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 14 లక్షల 90 వేల రూపాయలు ఖర్చు చేసి కల్పించిన అధునాతన వసతులను మంత్రి ప్రారంభించారు.అనంతరం 20 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి శంఖు స్థాపన చేశారు.
బ్యాంక్ లింకేజి ద్వారా 26 సంఘాలకు లబ్ది చేకూర్చే 3 కోట్ల 25 లక్షల రూపాయల చెక్ ను మహిళలకు అందించారు. ఒక్కొక్క సంఘానికి 20 లక్షల రూపాయలు, ఒక్కో సభ్యురాలికి 4 లక్షల రూపాయల లబ్ది చేకూరనుంది.
అనంతరం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఘనంగా జరిపే మహా శివరాత్రి పోస్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జీసిసి మాజీ చైర్మన్ గాంధీ నాయక్,
కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యా శాఖ అధికారి కె. రాము, మన ఊరు – మన బడి ప్రత్యేక అధికారి వినోద్ కుమార్, ఎంపీపీ బసవ సావిత్రి , జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామి రెడ్డి, ఏ.ఎం.సి వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ భూక్యా వీరేశ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి. వీరారెడ్డి, స్కూల్ చైర్మన్ భూక్యా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest