సర్పంచ్ మాదాడి భారతిని అభినందించిన వినోద్ కుమార్

  • రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ” పర్లపల్లి “
  • సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డిని అభినందించిన బోయినపల్లి వినోద్ కుమార్
  • బీ.ఆర్.ఎస్. లెజిస్లేచర్స్ పార్టీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి

హైదరాబాద్

దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సథత్ వికాస్ పురస్కారాలలో భాగంగా పచ్చధనం పరిశుభ్రత విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం ఎంపికైంది.ఈ సందర్భంగా ఆదివారం మంత్రుల నివాసంలో పర్లపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదాడి భారతి నర్సింహా రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందనలు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పర్లపల్లి గ్రామంలో హరిత విప్లవం తీసుకుని వచ్చిన సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డి రాష్ట్రంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని వినోద్ కుమార్ అన్నారు.భవిష్యత్తులో పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డి మరిన్ని అవార్డులు, రివార్డులు సాధించాలని కోరుకుంటున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.పర్లపల్లి గ్రామాన్ని రానున్న రోజుల్లో మరింత గ్రీనరిగా తీర్చిదిద్దాలని వినోద్ కుమార్ ఆకాంక్షించారు.సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డితోపాటు ఆమె కుమారుడు బీ.ఆర్.ఎస్. లెజిస్లేచర్స్ పార్టీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి కూడా ఉన్నారు.

హైకోర్టు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులకు వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు సమస్యలను వినోద్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు. హైకోర్టులోని మెడికల్ డిస్పెన్సరీని అప్గ్రేట్ చేసి వైద్య సిబ్బందిని నియమించాలని, లైబ్రరీ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ట్రేని న్యాయవాదులకు స్టాండింగ్ కౌన్సిల్ గా అవకాశాలు కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు.వినోద్ కుమార్ తో సమావేశమైన వారిలో హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కళ్యాణ్ రావు, కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest