హైదరాబాద్ :
విఖ్యాత కవి సినారె సతీమణి సుశీల పేరిట రచయిత్రులకు బహుకరిస్తున్న పురస్కారం మహిళా సాధికారత కు దర్పణ మని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం పూర్వ ఛైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్, ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి నిర్వ్యహణ లో సుశీలానారాయణ రెడ్డి సాహితీ పురస్కారం ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ కు ప్రదానోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిధిగా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ పాల్గోని పురస్కరం గా ఏభై వేల చెక్కు, జ్ఞాపిక, ప్రసంసాపత్రం బహుకరించి మాట్లాడారు. సుశీలానారాయణ రెడ్డి పురస్కరం అతి పవిత్ర మైనదని అన్నారు సినారె రాజీ పడని ధీరత్వం కల కవి ఆయన సతీమణి పేరిట ఏర్పరచిన పురస్కరం రచయిత్రులపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. కుప్పిలి పద్మ సామజిక స్పృహ కల రచయిత్రి అని ప్రశంసించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యం లో తన ముద్ర ను సుస్టాపితం చేసుకున్న పద్మ స్త్రీ వాద రచయిత్రి అనే కన్నా మానవీయ రచయిత్రి అనటం సముచితం అన్నారు ఆమె రచనలు అన్నీ ప్రకృతి, మానవత చుట్టూ అల్లు కొని వుంటాయని వివరించారు డాక్టర్ రాము స్వాగతం పలుకుతూ సుశీలానారాయణ రెడ్డి అవార్డ్ 39 సంవత్సరాలు గా నిరాటకం గా ప్రతిభ, వయస్సు, సాహితీ కృషి ప్రాతిపడిక గా రచయిత్రి ని ఎంపిక చేస్తున్నా మని తెలిపారు. ఆశా లత వ్యాఖ్యానం తో నర్తకి శృతి ప్రదర్శించిన కూచిపూడి నాట్య అంశాలు ఆకట్టుకున్నాయి