- ఏఐజీ ఆస్పత్రి వైద్యపరీక్షల్లో వెల్లడి
హైదరాబాద్ :
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపు నొప్పితో కేసీఆర్ ఆస్పత్రికి వచ్చారని చిన్న అల్సర్ ఉన్నట్లు తెలిపారు. సుమారు ఏడు గంటలపాటు ఆస్పత్రిలో ఉన్న అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్‌కు తిరిగి వెళ్లారు. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఆస్పత్రిలో గ్యాస్ట్రిక్ సంబంధిత పరీక్షలు చేసినట్లు ఏఐజీ ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగాధిపతి డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎండోస్కోపి, పొత్తి కడుపుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించామన్నారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. దాదాపు ఏడు గంటలపాటు ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ అనంతరం తిరిగి ప్రగతిభవన్‌కు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న గవర్నర్ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.