సోమేశ్ కు కేసీఆర్ హ్యాండ్ -రేరా చైర్మన్ గా శాంతికుమారి

హైదరాబాద్
రేరా చైర్మన్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి మాజీ సి ఎస్ సోమేశ్ కుమార్ ను ఈ పదవిలో నియమిస్తారని ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లి పదవి విరమణ తీసుకున్న సోమేశ్ కుమార్ కు తిరిగి తెలంగాణ రేరా చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఎందుకంటే తెలంగాణ చీఫ్ సెక్రెటరీగా పని చేసిన సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అతి సన్నిహితంగా ఉన్నారు. కోర్టు ఉత్తర్వులతో ఆంధ్రకు వెళ్లిన సోమేశ్ తిరిగి తెలంగాణ కు వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest