హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

* ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం
* త్వరలో ట్రైలర్ విడుదల
వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక ప్రధాన మరియు ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.
ప్రపంచం లోనే మొదటి సారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్ తో హన్సిక నటించగా తీసిన సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా.  ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగు లో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది.
సింగిల్ క్యారక్టర్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ  చిత్రంలోని పాత్రకు హన్సిక యాప్ట్. ఆవిడ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. చిత్రం అంతా సింగిల్ షాట్ లో కేవలం తన పాత్ర మీదే నడిచే సినిమా కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం చిత్రాన్ని తనే క్యారీ చేయాలి. తను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించింది. హన్సిక కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుంది. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణం. దర్శకులు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడే ఆయన ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చేసిన బిజీఎం సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సినిమా చూస్తున్నంత సేపు పాత్రతో పాటూ మనం ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సామ్ తన మ్యూజిక్ తో ఆద్యంతం టెన్షన్ నీ క్రియేట్ చేశారు. బ్రహ్మ కడలి గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా కుదిరింది. ఆయన పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. సింగిల్ షాట్ తో రన్ అయ్యే సినిమా కావడంతో  అనుకున్న షేడ్ రావడం కోసం  కెమెరామన్ కిషోర్ బోయిదాపు లైటింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా కొత్తగా ప్రయత్నించారు. ఆయన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కి అనుగుణంగా ఒక పర్ఫెక్ట్ సింక్ లో ఉండేలా చూసుకున్నారు. ఇక దర్శకులు రాజు దుస్సా గారు తను ఈ సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో సాగే స్టొరీ నీ నెరెట్ చేసిన దానికంటే బెటర్ గా తెరపైకి తీసుకురాగలిగారు. ప్రతి ఫ్రేమ్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సెకండ్ కథతో లింక్ అయ్యి ముందుకు నడిపిస్తుంది. అంత పర్జెక్ట్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశారు ఆయన. అందరూ ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్ గా చేయడంతో చిత్రం చాలా బాగా వచ్చింది. దేశంలోనే తొలిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో అతి తక్కువ డైలాగులతో తెరకెక్కిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనకి ఉన్న ప్యాషన్ వల్ల చిత్రం ఔట్ పుట్ లావిష్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కింది. చిత్ర బృందం త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
టైటిల్ : వన్ నాట్ ఫైవ్ మినిట్స్
జానర్ : సైకలాజికల్ థ్రిల్లర్
హన్సిక మోత్వాని నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
పోస్టర్ డిజైనర్ : సుధీర్ దొమ్మేటి
వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : ఫణి విహారి గంటల
డి ఐ & కలరిస్ట్ : బి వి ఆర్ శివకుమార్
మేకప్ మాన్ : డెక్క బాలు
స్టంట్ మాస్టర్ : మల్లి
స్టిల్స్ : గుణకర్
ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ : అట్లూరి సురేష్ బాబు
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ & స్క్రిప్ట్ చీఫ్ అసోసియేట్ : రూప కిరణ్ గంజి
ఎస్ ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : జైసన్ జోస్
పిఆర్ఓ : బి ఎ రాజు’s టీం
ఎడిటర్ : శ్యామ్ వడవల్లి
ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి
డి ఓ పి : కిషోర్ బోయిదాపు
మ్యూజిక్ : సామ్ సి ఎస్
కో ప్రొడ్యూసర్ : బొమ్మక్ యషిత
ప్రొడ్యూసర్ : బొమ్మక్ శివ
రచన & దర్శకత్వం : రాజు దుస్సా
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Hansika Starrer ‘One Not Five Minuttess’ Filmed In Single Shot With Single Character Will Enthrall The Audience… Trailer Releasing Soon
For the first time in world cinema, a film titled ‘One Not Five Minuttess’ starring Hansika is being filmed in a single shot with a single character. Written and Directed by Raju Dussa Produced by Bommak Shiva under Rudransh Celluloids banner. The film has finished all works and the first copy got ready. The team is planning to release the film soon. Meanwhile Trailer will be out in the coming days.
‘One Not Five Minuttess’ is the world’s first movie filmed in single shot with single character starring Hansika. The film’s duration is one hour and forty five minutes and filming such a duration in a single shot in an intriguing manner involves meticulous planning and execution. ‘One Not Five Minuttess’ films comes under the category of Hollywood films like Bird Man and 1917 which were shot with single shot technique. But, those films have multiple characters whereas One Not Five Minuttess has only one character. The reel time and real time runs parallel and takes the audience into that world giving a real-time experience. Dialogues are also very minimal in the film and the film runs with a gripping screenplay. It is praiseworthy that such an experiment has been made in Telugu for the time in the country. Another fascinating thing is the film was shot live without using any green mat and CG work done later. This stands as an example for the vision of director and talent of DOP. After completing the film and attaining the first copy, the entire team is elated with the excellent output they got even better than what they expected. This film will become a benchmark technical wise filming in single shot with single character.
Hansika is perfectly suited for this film which is billed to be a psychological thriller made with only one character. She added more value to the film. As the entire film runs on a single shot with a single character, she needs to carry the entire film with her screen presence and expressions. She gave her one hundred percent for the film and lived in the skin of the role. She emoted exemplary as a girl who needs to protect herself from an invisible hunter. ‘One Not Five Minuttess’ will be the best film in Hansika ‘s career. Everyone will agree with the same after watching the film. Sam CS has provided the music for this film where re-recording has utmost importance. When the director narrated the story, Sam has taken it as a challenge and composed the BGM with a special care. His RR has taken the film to a whole new level. We will travel along with the character onscreen in a trans while.watching the film. Sam has created a tension with his music throughout the film. Brahma Kadali did an amazing art work. We can experience his work at every level in the film. As the film runs on a single shot, cinematographer Kishore Boyidapu has tried a new lighting technique to get the desired shade. His camera work helped the film to carry a perfect mood in sync with the story. Coming to the main man, Director Raju Dussa has made the film even better than what he narrated. His water-tight screenplay makes every frame important and every second linked to the story. Everyone has involved and dedicated themselves in shaping this film so perfectly. For the first time ever to make a film in a single shot with a single character with minimum dialogues, producer needs guts and passion. Bommak Shiva is such a daring producer and he deserves all the accolades for his uncompromised nature which resulted in the output with lavish production values. Team is planning to release the trailer soon. The film will be released in the coming days.
Title : One Not Five Minuttess
Genre : Psychological Thriller
Cast
Hansika Motwani
Crew
Poster Designer : Sudhir Dommeti
VFX Supervisor : Phani Vihari Ghantala
DI & Colorist : BVR Shiva Kumar
Make-up Man : Dekka Balu
Stunt Master : Malli
Stills : Gunakar
Production Executive : Atluri Suresh Babu
Executive Producer And Script Chief Associate : Roopa Kiran Ganji
SFX Supervisor : Jaison Jose
PRO : BA Raju’s Team
Editor : Shyam Vadavalli
Production Designer : Brahma Kadali
DOP : Kishore Boyidapu
Music : Sam CS
Co-Producer : Bommak Yashitha
Producer : Bommak Shiva
Written & Directed by Raju Dussa
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest