హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సిటాడెల్ పేరుతో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ను చేసిన సంగతి తెలిసిందే. నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత బాలీవుడ్ సినిమాలకు దూరమైన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలనే చేస్తుంది. మ్యాట్రిక్స్, బేవాచ్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సిటాడెల్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తుంది.
ఈ వెబ్ సిరీస్ కు కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ సినిమాల ఫేమ్ రూసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా తో పాటు రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సిటాడెల్ వెబ్ సిరీస్ భారీ బడ్జెక్టులో తెరకెక్కుతుంది.
ఈ వెబ్ సిరీస్ ను హాలీవుడ్ తో పాటు హిందీలో ఒకే సారి నిర్మిస్తున్నారు రూసో బ్రదర్స్.హిందీ వెర్షన్ లో సమంత(, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో రాజ్, డీకే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ సిరీస్ వెర్షన్ షూటింగ్ పూర్తవ్వగా హిందీ వెర్షన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రస్తుతం సమంత, వరుణ్ ధావన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.
స్టాన్లీ టుచీ, లెస్లీ మాన్విల్లేతో కలిసి రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన గ్లోబల్ స్పై సిరీస్ సిటడెల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్‌ను, ప్రీమియర్ తేదీని ప్రైమ్ వీడియో వెల్లడించింది.
ఈ ఎపిక్ థ్రిల్లర్ ఏప్రిల్ 28న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.