హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం
  • గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు?
  • సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు

 

వెలగపూడి :

స్కిల్‌డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌17 ఏ ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఈ ప్రక్రియ అంతా సరికాదు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై వాదనలు వినిపిస్తామని పిటిషన్‌లో దమ్మాలపాటి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ బుధవారం చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest