హైదరాబాద్ లో కొత్త కమిషనరేట్ -20 కొత్త పోలీస్ స్టేషన్లు

హైదరాబాద్:

హైదరాబాద్ కొత్త కమిషనరేట్ పరిధిలో 20 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దోమల్ గూడ, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్ బండ్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలిచౌకి-గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండ ప్రాంతాల్లో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 6జోన్లలో జోన్ కు 1 చొప్పున మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. త్వరలో కొత్త పోలీస్ స్టేషన్లకు ఇన్ స్పెక్టర్లు, సిబ్బందిని నియమించనున్నారు. హైదరాబాద్ లో మరో 13 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest