హైదరాబాద్ లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్

రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్ కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్ ను పక్కకు మార్చాల్సి ఉంది.

కాబట్టి తేది: 08.03.2023, బుధవారం ఉదయం 6 గంటల నుంచి తేది: 10.03.2023, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు.. మొత్తం 66 గంటల పాటు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 66 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

పూర్తిగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్ నం.12 (కుత్బుల్లాపూర్) : షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం.
2. ఓ అండ్ ఎం డివిజన్ నం.13 (మల్కాజ్ గిరి/అల్వాల్) : డిఫెన్స్ కాలనీ.
3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 19 : నాగారం/ దమ్మాయి గూడ, కీసర.
4. ఓ అండ్ ఎం డివిజన్ నం. 24 (బొల్లారం) : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ సప్లై.
5. ఓ అండ్ ఎం డివిజన్ నం. 25 (కొంపల్లి) : కొంపల్లి, గొండ్ల పోచంపల్లి ప్రాంతాలు.
ఆర్ డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలు : కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.
6. ఓ అండ్ ఎం డివిజన్ నం. 14 (ఉప్పల్) : కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.

పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
7. ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్. ఆర్. నగర్) : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.
8. ఓ అండ్ ఎం డివిజన్ నం. 9 (కూకట్ పల్లి) : కేపీహెచ్ బీ, మల్యాసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు.
9. ఓ అండ్ ఎం డివిజన్ నం. 15 (శేరిలింగం పల్లి) : లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు.
10. ఓ అండ్ ఎం డివిజన్ నం. 23 ( నిజాంపేట్) : ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుపల్లి.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest