అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఈ బడ్జెట్ లో 250 జీవోలను విడుదల

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 3వ తేది నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి నేడు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో మరియు ఆశ్రమ స్కూల్స్ లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ పై మంత్రి సత్యవతి రాథోడ్ , గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రాస్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ బాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటిడిఏ పిఓ అధికారులతో, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో  ముఖ్యమంత్రి కేసిఆర్  పాలన గిరిజన సంక్షేమానికి ఒక స్వర్ణయుగం అని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్  అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని డిఎస్ఎస్ భవన్ లో 2022- 23 బడ్జెట్ ప్రగతివేదికను మంత్రి విడుదల చేశారు. గిరిజనుల అస్థిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమాపథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను చిత్తశుద్ధిని చాటుతున్న,  గిరిజనుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్  వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఈ బడ్జెట్ లో 250 జీవోలను విడుదల చేసారని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత పాలకులు, ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిన్నచూపు ఉండేదని గిరిజనులను అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడికి ఆలోచన రాలేదని విమర్శించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ ఏర్పడిన
అనతికాలంలోనే గిరిజన ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసి చూపించారు. గతంలో ఉన్న తాండాల పరిస్థితి, ఇప్పుడు ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మన కళ్లకు కనిపిస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ 6 నుండి 10, శాతానికి పెంచడం ద్వారా గిరిజనులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగాయని,
గత ఎడాది సెప్టెంబర్ 17 తేదిన సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంచినందు వల్ల గిరిజన విద్యార్ధులకు ఇంజనీరింగ్ సీట్లు 3,195, మేడికల్ సీట్లు 189, మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర డిపార్ట్ మెంట్ల్ లలో పోస్ట్ ల నియమాకానికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ లలో సూమారు గా 903 పోస్టులు అధనంగా వస్తున్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని ఆదివాసి గూడాలు తాండాలకు సుమారు రెండువేల కోట్లతో బీటీ రోడ్లకు మంజూరు ఇవ్వడం జరిగిందని,1179 రోడ్లు, 3152.41 కిలోమీటర్ల నిడివితో 2000 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్య విధానంలో విప్లవాత్మకమైన నిర్ణయాలతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 యూనివర్సిటీలలో ఒక్కో యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా బాలురకు, బాలికలకు వేరువేరుగా హాస్టళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నాము వీటికి గాను 140 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో 500 జనాభా ధాటిన 2వేల 471 గిరిజన తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామా పంచాయితీలుగా మార్చి, “మా గూడేంలో మా రాజ్యం మా తండాలో మా పాలన” కావలనే గిరిజన ఆదివాసి బిడ్డల దశాబ్ధాల కలను సాకారం చేసారు. దీంతో ప్రస్తుతం మొత్తం 3,146 గిరిజన గ్రామాపంచాతీలు రాష్ట్రంలో ఎర్పడ్డాయి. గ్రామపంచాయితీల ఎర్పాటుతోనే ఆగకుండా వాటి అన్నీంటికి పరిపాలన భవనాల నిర్మాణాలకు ఒక్కో భవనానికి 20 లక్షల రూపాయాల చొప్పున 600 కోట్ల నిధులతో మంజూరి ఇవ్వడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 3,467 గిరిజన ఆవాసాలకు 324 కోట్లు ఖర్చు చేసి త్రిఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. దిని ద్వారా 2.4 లక్షల ఎకరాల భూవిస్థిర్ణానికి విద్యుత్ సౌకర్యం ఎర్పడి పేద గిరిజన రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా తో పాటు బాన్సువాడలో కొత్తగా రెండు గిరిజన గురుకులాల ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగిందని, ఒక్కో గురుకుల బిల్డింగ్ కు 12 కోట్లతో మంజూరు ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ గురుకులాలో తరగతులు ప్రారంభం అవుతాయని,
గిరిజన గురుకులల్లో విద్యార్థులకు అదనపు సౌకర్యాల ఏర్పాటుకు గాను 45 గురుకులాల్లో 225 కోట్లతో అదనపు బిల్డింగుల నిర్మాణాలకు మంజూరు ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు..

ఈ రాష్ట్రంలోని బంజారాల ఆదీవాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట రాజధాని నడిబొడ్డున బంజారహిల్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి 50 కోట్లతో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీమ్ ఆదీవాసీ భవన్ లను నిర్మించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 71 కోట్ల 95 లక్షల వ్యయంతో 32 ఆదీవాసీ, బంజారా భవన్ లను ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం 35 నియోజకవర్గాల్లో 47 కోట్లతో బంజారా భవన్ ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఒక లక్ష, ఒక వెయ్యి గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దీని కోసం 192 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

“గిరివికాసం” పథకం ద్వారా సాగుకు అనుకులంగా లేని భూములను సాగు భూములుగా మార్చేందుకు ఈ సంవత్సరం 56 వేల 613 ఎకారాల భూమికి 98 కోట్ల 23 లక్షలు ఖర్చుచేయడం ద్వారా 19వేల 698 మంది గిరిజన రైతులు లబ్ది పొందారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

గిరిజన యువతను పారిశ్రామిక వెత్తలు తీర్చ దిద్దేందుకు ప్రత్యేకంగా సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం 2018 లో ప్రారంభించి, ప్రపంచస్థాయి ప్రమాణాలున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ ఇప్పించి, అత్యధికంగా కోటిరూపాయలకు పైగా ఆర్ధిక తోడ్పాటునందించి,అద్భుతమైన పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తూ ప్రగతిపథంలో వారిని భాగస్వామ్యులు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 100 మంది వరకు పరిమితి ఉన్న సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం కింద ఈ ఏడాది నుండి 200 మందికి ఈ అవకాశం కలిపిస్తున్నాము. ఇప్పటివరకు 91 మందికి సుమారుగా 103 కోట్లతో వివిధ రకాల యూనిట్లు ప్రారంభించడం జరిగింది. మిగతావారు త్వరలోనే వారు యూనిట్లను ప్రారంభించకోబో తున్నారని మంత్రి సత్యవతి తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో ప్రారంభించిన అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకం విద్యార్థులకు వరంగా మారిందని,అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే పేద గిరిజన విద్యర్ధులకు 20లక్షల రూపాయాల ఆర్ధిక సహయాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 353 మంది విద్యార్థులకు సుమారు 55.10 కోట్లు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు.

గిరిజన విద్యార్ధులకు కార్పోరేట్ విద్యను అందించేందేకు గాను BAS స్కీమ్ కింద ప్రస్తుతమున్న 30 వేల రూపాయల ఫీజును 42 వేలకు పెంచడం జరిగిందని, దింతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఈ పథకం కింద 81 స్కూళ్లలో చదువుతున్న 647 మంది విద్యార్థులకు సుమారుగా 27.03 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియానికి మార్చడం ద్వారా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీంతో ప్రస్తుతం ఉన్న 1804 సి ఆర్ టి లకు అదనంగా మరో 294 కాంట్రాక్టు ఉపాధ్యాయుల నియామకాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు ఉద్యోగులకు మిగతా గురుకులాల్లో మాదిరిగా 12 నెలల జీతం ఇవ్వడం జరిగుతుందని స్పష్టం చేశారు.

రైతుబంధు పథకం ద్వారా దాదాపు 8 లక్షల మంది గిరిజన రైతులకు ఇప్పటి వరకు 8వేల 305 కోట్లు అందించడం జరిగిందన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జిసిసి లోని 30 మందికి కారుణ్య నియామకాలను చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మారు మూల ప్రాంతాల్లో చదివే విద్యార్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్ధులకు సత్వరమే వైద్యం అందించే విధంగా అన్ని ఆశ్రమ పాఠశాలలో 623 మంది ANM లను ఔట్ సోర్సింగ్ లో తీసుకునే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఎర్పాట్లు చేయడం జరుగుతుందని. పోడు భూములకు సంభందించి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వరకు సాగులో ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందించడం జరుగుతుందని. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పంపిణీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని మంత్రి సత్యవతి రాత్రి గారు అన్నారు.

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గారు
గిరిజనుల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. 9 ఏళ్ల పాలనలో

గతంలో ఎన్నడు లేనివిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి సత్యవతి రాథోడ్ గారు రాష్ట్ర గిరిజనుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
క్రిస్టినా జెడ్ చొంగ్తు, ట్రైకర్ చైర్మన్ రామచంద్రనాయక్, జిసిసి చైర్మన్ రామవత్ వాల్యా నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest