SLIDER-RIGHT TELANGANA

ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ షటిల్‌ బస్‌లు

  హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో టికెట్‌ బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌.. బస్‌ ట్రాకింగ్‌ సదుపాయం త్వరలోనే ప్రారంభం.. ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహణ హైదరాబాద్ , నవంబర్ 30 : ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటీల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల […]

National SLIDER-RIGHT

NDTV ఫౌండర్ ప్రణయ్ రాయ్ రాజీనామా

న్యూ ఢిల్లీ , నవంబర్ 30 : ప్రముఖ జాతీయ మీడియా సంస్థNDTV ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య రాధికా రాయ్ కూడా తన డైరెక్టర్ పదవికి రాజీనామా ఇచ్చేశారు. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను అదానీ గ్రూపు దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ కంపెనీని అదానీ కొనుగోలు చేయడంతో… అదానీ […]

SLIDER-RIGHT TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ?

  ఢిల్లీ, నవంబర్ 30 : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత పేరు చేర్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు వంద కోట్లకు సంబధించిన ఈ వ్యవహారం తెలంగాణ లో టి ఆర్ ఎస్ మెడకు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ […]

SLIDER-RIGHT TELANGANA

జనవరి 18న సచివాలయం-ముహూర్తం ఫిక్స్ ?

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 18న సచివాలయం 6 వ అంతస్తులోని సీఎం బ్లాకును కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి సీఎం ఛాంబర్ నుంచి పాలన కొనసాగిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించడంతో పాటు అందుకు అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ […]

CINEMA SLIDER-RIGHT

యశోద సినిమాలో ఇవ ఆసుపత్రి సన్నివేశాల తొలగింపు

హైదరాబాద్, నవంబర్ 29 : యశోద సినిమాలో కనిపించిన ఇవా ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాలను తొలగించమని యశోద సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇవ పేరుతో ఆసుపత్రి ఉన్న విషయం తమకు అసలు తెలియదని అన్నారు. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ తో పాటు ఇవ ఆసుపత్రి అధినేత మురళి మోహన్ మాట్లాడారు. ఇవ ఆసుపత్రికి యాజమాన్యం యశోద సినిమాలో ఆసుపత్రికి సంబధించిన […]

SLIDER-RIGHT TELANGANA

షర్మిల అరెస్ట్ -SR నగర్ లో హైడ్రామా

హైదరాబాద్, నవంబర్ 29 : తెలంగాణ ప్రగతి భవన్ లోకి కారులో దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన వై ఎస్ ఆర్ టి పీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ కార్యకర్తల హైడ్రామా షురూ అయింది. కార్యకర్తలందరిని ఎస్ ఆర్ నగర్ పీ ఎస్ కు రావాలని షర్మిల పార్టీకి చెందిన నేతలు […]

CINEMA SLIDER-RIGHT

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ హీరో తిరువీర్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై […]

SLIDER-RIGHT TELANGANA

సమిష్టి కృషి తో మంచి ఫలితాలు :CM KCR

హైదరాబాద్, నవంబర్ 27 : ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సిఎం తెలిపారు. స్వరాష్ట్రంలో వొక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వున్నదన్నారు. సాధించినదానికి […]

CINEMA SLIDER-RIGHT

ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం

  హైదరాబాద్ : వెండితెర సూపర్ స్టార్ కృష్ణ నవంబరు 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ దశదిన కర్మ కార్యక్రమం నేడు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ భోజన ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5 వేల […]

SLIDER-RIGHT TELANGANA

‘బండి’యాత్ర కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్, నవంబర్ 27 : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ భైంసా నుండి చేపట్టే ప్రజా సంగ్రామ యాత్ర (పాదయాత్ర) కు పోలీసులు అనుమతి నిరాకరించారు. బైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ హాజరయ్యే బహిరంగ సభకు కూడా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రను చేపట్టి తీరుతామని బండి సంజయ్ కుమార్ స్పష్టం […]