International

కొరోనా కఠిన చర్యలపై చైనాలో నిరసన

బీజింగ్ : చైనా దేశంలో కొరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడి సర్కారు కఠిన చర్యలకు దిగింది. కొరోనాను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. దీంతో అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. నిరసనలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ నిరసనలు పెద్ద నగరాల వరకు వ్యాపించాయి. చైనా రాజధాని బీజింగ్, ఫైనాన్స్ సిటీ అయినా షాంఘై లో నిరసనలు మొదలైయ్యాయి. చైనా దేశ అధ్యక్షుడు జింపింగ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. కొరోనా నివారణకు […]

International

గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి

  న్యూఢిల్లీ : భారత గణతంత్ర వేడులకు ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా పంపిన ఆహ్వానాన్ని అక్టోబరు 16న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అల్-సిసికి అందజేశారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడిని ఆహ్వానించడం వెనక ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. రెండు దేశాలు ఈ ఏడాది దౌత్య సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవాన్ని […]

International

చైనా లో మళ్ళీ విజృంభిస్తున్న వైరస్

బీజింగ్ : చైనా లో మళ్ళీ కొరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కోరిన కేసులు నమోదవుతున్నాయి. చైనా లో కొరోనా మొదలైనప్పటి నుంచి కూడా చైనా కొరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కేసులు పెరుగుతునే ఉన్నాయి. చైనా రాజధాని బీజింగ్ , దక్షిణ వాణిజ్య కేంద్రమైన గ్వాంగ్ జౌ తో సహా అనేక ప్రధాన నగరాల్లో కొరోనా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్ కొరోనా కేసుల సంఖ్య గరిష్టంగా 28,000 ఉండగా, తాజాగా బుధవారం నాటికి […]

International

US సూపర్ మార్కెట్ లో కాల్పులు – 6గురు మృతి -4గురికి గాయాలు

వర్జీనియా : అమెరికా దేశం వర్జీనియా రాష్ట్రంలోని ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం రేపాయి. సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. వర్జీనియా రాష్ట్రం చీసాపీక్ లోని సూపర్ మార్కెట్ బ్రాంచ్ లో సహా ఉద్యోగులపై కిరాతకంగా కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. తరువాత కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అయితే సదరు […]

International

Ukraine War – కైవ్ లో అంధకారం

కైవ్ : ఉక్రెయిన్ లోని పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరుస సమ్మెలతో పలు ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎల్విన్, ఒడెస్సా నగరాలతో పాటు కైవ్ నగరాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మాల్డో వాలో కూడా విద్యుత్ లేదని ఉక్రెయిన్ ఉప ప్రధాని వెల్లడించారు. ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థలో మూడు ప్రధాన పవర్ స్టేషన్ లను డిస్ కనెక్ట్ చేశారు. రష్యా గత కొంత కాలంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను […]

International

ఖతార్ స్టేడియంలో మద్యం అమ్మకాలపై నిషేధం

  ఖతార్ : ఫిఫా ప్రపంచ కప్ -2022 జరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లోని స్టేడియంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. అయితే ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రం మద్యం లభించనుంది. ఆదివారం ఈక్వెడార్ తో ఖతార్ లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఫిఫా ప్రపంచ కప్ ప్రధాన స్పాన్సర్ అయినా బాడ్ వైజర్ బీర్ ను మాత్రమే అమ్ముకునే అవకాశం కల్పించారు.

International SLIDER-RIGHT

యుకెకు ఇండియా యువత క్యూ

ఇండోనేషియా : యుకె కు ఇండియ యువత ఇక క్యూ కట్టొచ్చని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. ఈ మేరకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ తో ఈ విషయాలను చెప్పారు. జీ20 దేశాల సమావేశాల్లో ఈ నిర్ణయం ప్రకటించారు. భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భేటీ అయి కొద్దీ సేపు చర్చించారు. యువత యుకె కు వచ్చి చదువుకునేందుకు బ్రిటన్ సర్కార్ కూడా సహాయం చేస్తుందని రిషి చెప్పారు. వ్యాపార […]

International

800 కోట్లకు ప్రపంచ జనాభా-చైనాను దాటనున్న భారత్

న్యూ ఢిల్లీ : ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. నవంబర్‌ 15నాటికి భూమి మీద మానవ జనాభా 8వందల కోట్లను దాటనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెల్లడించింది. ఈ మైలురాయి చేరేందుకు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో దీనిపై చర్చ మొదలైంది. నవంబర్‌ 15 నాటికి భూమిపై జీవనం సాగిస్తున్న మానవ జనాభా 8వందల కోట్లకు చేరనుందని జూలైలో ఐరాస అంచనా వేసింది.ఈ సందర్భంగా మనిషి తాను […]

International

జిన్ పింగ్ -బైడెన్ భేటీ -పలు అంశాలపై చర్చలు

అమెరికా : చైనాతో ప్రచ్ఛన్న యుద్ధం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించాడు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో జరిగిన సామరస్య పూర్వక సమావేశ తరువాత బైడెన్ ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. తైవాన్ పై చైనా దాడి చేస్తోందని తాను నమ్మడం లేదని అన్నారు. ఇండోనేషియా ద్వీపంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు బాలిలో జరిగిన చర్చలలో ఈ ఇద్దరు అగ్రనేతలు కలుసుకున్నారు. ఈ […]

International

చదువు మానేసి..చాయ్‌తో రూ.5 కోట్లు-మెల్‌బోర్న్‌లో నెల్లూరు కుర్రాడు ఘనత

    మెల్‌బోర్న్‌లో నెల్లూరు కుర్రాడు కొండా సంజిత్‌ ఘనత ఏడాదిలోనే రాణించిన అంకురం మెల్‌బోర్న్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చదివి మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకు వెళ్లాక తనకు ఉద్యోగం సరికాదనే నిర్ణయానికి వచ్చి, చాయ్‌తో అద్భుతాన్నే చేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరం కాఫీకి ప్రసిద్ధి. ఇపుడు అక్కడ మన నెల్లూరు కుర్రాడి చాయ్‌ […]