AP

రతన్ టాటా కు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన నాని

  రతన్ టాటా కి తమ కుమార్తె చి. కుమారి శ్వేత వివాహ శుభలేఖ అందించి సాదరంగా ఆహ్వానించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని శ్రీనివాస్ (నాని) , శ్రీమతి పావని దంపతులు.

AP

ఇక తిరుపతిలోనే శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు

  తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు తిరుపతిలోనే జారీ చేస్తున్నట్టు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మాధవం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను బుధవారం ఆయన ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళం ఇచ్చి, రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటి వరకు తిరుమలలోనే ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేశామని తెలిపారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తితిదే యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు […]

AP

కర్నూల్ లో పడిపోయిన టమాటా ధర

కర్నూల్ , నవంబర్ 29 : నిన్నమొన్నటి వరకు అందనంత ఎత్తులో ఉన్న టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలోకూ రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు. రేటు దారుణంగా పడిపోవడంతో కనీసం కూలి డబ్బులు కూడా తిరిగొచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాట ధర దారుణంగా పడిపోయింది. దీంతో కనీస మద్దతు ధర కూడా దక్కట్లేదని రైతులు వాపోతున్నారు. […]

AP

జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు

అమరావతి, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సంఘాలు పోరు బాట పట్టాయి. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రి జగన్ ఇంటి చుట్టూ భారీగా పొలిసు బందోబస్తును ఏర్పాటు చేశాయి. వాల్మీకి, బోయ , బెంతు, ఒరియా లాంటి కులాలను గిరిజనుల్లో కలిపితే తమ రిజర్వేషన్ పోతుందని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో తాడేపల్లిగూడెం లోని జగన్ నివాసం వైపుకు వెళ్లే ప్రతి వాహనాని […]

AP

కడప నగర మేయర్ కు ఘన సన్మానం

  కడప వైయస్సార్ జిల్లా   కడప నగరంలోని అపూర్వ కళ్యాణమండపం నందు వైఎస్ఆర్సిపి వైయస్సార్ జిల్లా అధ్యక్షులుగా కడప నగర మేయర్ సురేష్ బాబు  నియమితులైన సందర్భంగా మాసాపేట శ్రీ రామాలయం కమిటీ సభ్యులు త్యాగరాజు,ధర్మకర్త గంగాధర్,వరహాలు,సాయి, మైకేల్ , జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ప్రసాద్ రెడ్డి ,రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, బసవరాజు ,సాయి పేట శీను, రామ్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి […]

AP

రూ.2 కోట్ల ఖర్చుతో జగన్ పుట్టినరోజు

అమరావతి, నవంబర్ 26 : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడని మంత్రి రోజా పర్యాటకశాఖ పేరుతో చేస్తున్న డ్యాన్సులు, ఉత్సవాల పేరుతో రూ.2 కోట్ల ప్రజల సొమ్ము తగలేస్తున్న తీరు చూస్తుంటే, ప్రజలంతా మూకుమ్మడిగా ఇదేం ఖర్మరా మాకు అంటున్నారని టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. రూ.2 కోట్ల ఖర్చుతో పుట్టినరోజు చేయడానికి జగన్ రెడ్డి ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఊడబెరికాడని నిలదీశారు. వంగలపూడి అనిత  జూమ్ ద్వారా మీడియాతో […]

AP SLIDER-RIGHT

బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్రాన్ని శాసించేది వారే!

  * రాజకీయ చైతన్యంతో ఒకరిని ప్రాధేయపడే పరిస్థితి మార్చండి *కులానికో పదవి రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారు * కులంలో కొంతమంది చెంచాలు కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు * బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగాలి * తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి జనసేన అండగా ఉంటుంది * ముఖ్యమంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు * మంగళగిరిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ […]

AP

చిరంజీవికి మాజీ సీజేఐ NV రమణ లేఖ

  స్వయంకృషితో అత్యున్నత శిఖరాలకు… ప్రత్యేకంగా లేఖ ద్వారా మాజీ సీజేఐ అభినందనలు. చిరంజీవికి ప్రముఖుల ప్రశంసలు. చంద్రబాబు సైతం తాజాగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాసారు. జాతీయ స్థాయిలో తెలుగు ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారానికి ఎంపిక కావటం పట్ల అభినందనలు తెలిపారు. తెలుగు సినీ రంగం గర్వించదగిన శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరుగా పేర్కొన్నారు. కళామతల్లికి […]

AP

డిసెంబరు 5న ఢిల్లీ పర్యటనకు జగన్-బాబు

  అమరావతి, నవంబర్ 24 : ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబరు 5న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ ఏడాది జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కేంద్రం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సదస్సులు, సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు రావాలని జగన్, చంద్రబాబులకు పిలుపు అందింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని […]

AP

ప్రజాస్వామ్య పరిరక్షణకై టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఐక్యత

  జీ 20కి కమలం పోలిన లోగో దుర్మార్గం మహిళా బిల్లు ఆమోదించాలి గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం జాతీయ స్థాయి పోరాటం ప్రభుత్వాల ఆరాచకాలను సుప్రీం సుమోటోగా తీసుకోవాలి బిగ్ బాస్ కేసు స్వీకరించిన ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ కీలక వ్యాఖ్యలు విజయవాడ : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలను, అరాచకాలను అరికట్టేందుకుగాను టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల ఐక్యత […]