National SLIDER-RIGHT

Bharat Jodo yatra మహారాష్ట్ర TO మధ్య ప్రదేశ్

ముంబై , (మహారాష్ట్ర ), నవంబర్ 22 :

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం మధ్య ప్రదేశ్ లో ప్రవేశించనుంది. మహారాష్ట్రలో యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ బుర్హాన్ పూర్ వద్ద మధ్య ప్రదేశ్ లో ప్రవేశిస్తారు. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొంటారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 6 రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసినట్టు అవుతుంది. 7వ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ లో ప్రవేశిస్తారు. మధ్య ప్రదేశ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని యాత్ర చైర్మన్ జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రియాంక గాంధీ నాలుగు రోజుల పాటు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు తమిళనాడు (కన్యాకుమారి) , కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ల్లో పూర్తయింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *