National SLIDER-RIGHT

బీజేపీ రెండు హిందూస్తాన్ లను సృష్టిస్తోంది

 

  • ఒకటి ధనవంతుల హిందుస్థాన్
  • రెండు పేద ప్రజల హిందూస్తాన్
  • మాకు ఒకటే హిందూస్తాన్ కావాలి
  • ఒకరిద్దరికి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి దొరకదు
  • లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి
  • గుజరాత్ నుంచే యాత్రకు స్ఫూర్తి
  • గుజరాత్ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ

రాజ్ కోట్ (గుజరాత్ ): నవంబర్ 22 :

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు హిందుస్తాన్ లను సృష్టిస్తోందని రాహుల్ గాంధీ మండి పడ్డారు. మాకు రెండు హిందూస్తాన్ లు కాదు ఒకటే హిందూస్తాన్ కావాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. అది కూడా ఒకరిద్దరికి దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ ఎన్నికల సందర్బంగా రాజ్ కోట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ప్రసంగం ప్రారంభంలోనే మీడియా పై సెటైర్లు వేశారు.
గుజరాత్ రైతులు, యువకులు , ప్రెస్ మిత్రులు అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ప్రెస్ మిత్రులమాదిరిగానే ఉంటారు కానీ టీవీల్లో మమ్ముల్ని చూపించారు అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో జనం ఈలలు వేశారు.చూడండి నవ్వుతున్నారు… వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉంది. మీడియా వాళ్ళ తప్పు లేదు వీళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ వీరి యాజమాన్యం అని అన్నారు. ఆ తరువాత రాహుల్ గాంధీ ప్రసంగం ఇలా సాగింది.

70 రోజుల క్రితం కన్యాకుమారి నుంచి నేను భారత్ జోడో యాత్ర ప్రారంభించా. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్య ప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్నాం. యాత్ర శ్రీనగర్ వరకు వెళ్తుంది. శ్రీనగర్ లో మన తిరంగా జెండా ఆవిష్కరిస్తాం . సుమారు 3500 కిలోమీటర్లు,
120 నుంచి 150 రోజులు పడుతుంది. నడుచుకుంటూ వెళ్తున్న. చాలా నేర్చుకుంటున్నాను . యువతతో మాట్లాడుతున్న. రైతులతో , కార్మికులతో , చిన్న చిన్న వ్యాపారస్థులతో చిన్న తరహా , మధ్య తరహా పరిశ్రమలు నడిపే వారితో మాట్లాడుతున్న . ఎంతో ఆప్యాత లభిస్తోంది. అన్ని ప్రాంతాల్లో ప్రేమానురాగాలు లభిస్తున్నాయి. లక్షలాది మంది పాల్గొంటున్నారు. ఈ టివి వాళ్ళు పూర్తిగా చూపించండం లేదు కానీ నది పారినట్టు జనాలు వస్తున్నారు. రోజు 5. 30 గంటలకే జనాలు వస్తారు 6 గంటలకు యాత్ర ప్రారంభిస్తాం. రాత్రి 7.30 లేదా 8 గంటలకు యాత్ర ముగిస్తుంది. అలిసిపోయినట్టు అనిపించడం లేదు. ప్రజల శక్తి, మద్దత్తు మరింత బలాన్నిస్తోంది. యాత్ర గుజరాత్ నుంచి రాలేకపోయాం అదే బాధగా ఉంది. చాలా సంతోషంగా ఉంది కానీ బాధగా కూడా అనిపిస్తోంది. వేలాది మంది యువకులతో మాట్లాడాను. ప్రతి అయిదు పది నిమిషాలకు యువకులు వస్తారు. వాళ్ళు కన్న కళల గురించి చెప్పారు. కొందరు ఇంజనీయర్ కావాలని అనుకుంటున్నారు. చాలా రోజులు కస్టపడి చదివాం. కళలు కన్నం ఇంజనీయర్ కావాలని కంప్యూటర్ ఇంజనీయర్ అవుతామని కళలు కన్నం కానీ కూలి పని చేస్తున్నాం. అని చెప్తున్నారు. కొందరు డాక్టర్ కావాలని అనుకున్న. చదువు కోసం ప్రైవేట్ కాలేజీకి లక్షల రూపాయలు ఇచ్చాము కానీ ఈ రోజు ఉబర్ కార్ నడుపుకోవలసి వచ్చింది. పిజా డెలివరీ చేయాల్సి వస్తోంది.
రైతులతో మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతోంది. రాహుల్ గారు మాకు విషయం అర్థం కావడం లేదు హిందూస్తాన్ లో ముగ్గురు, నలుగురు ధనవంతులు (అరబ్ పతి)కోట్లల్లో ఋణం తీరుకుంటారు. దేశంలో అందరికంటే ధనవంతుల అప్పు మాఫీ అవుతోంది. మేమెం తప్పు చేసాం ? మేం యాభైవేల అప్పు తీసుకుంటాం లేదా లక్ష రూపాయలు తీసుకుంటాం. మేము తీసుకున్న అప్పులు ఎప్పడు మాఫీ చేయరెందుకు ? వాళ్ళు అప్పు తిరిగి కట్టరు వారిని మాత్రం ప్రభుత్వం నాన్ పెర్ఫార్మింగ్ అసిడ్ అని పిలుస్తుంది. వాళ్లకు వ్యతిరేకంగా ఎలాంటి విచారణ ఉండదు. కానీ రైతు యాభైవేల రూపాయలు అప్పు చేసి కట్టకపోతే డిఫాల్టర్ అని పిలుస్తున్నారు. ఈ ప్రశ్న రైతులు అడుగుతున్నారు.
ప్రధానమంత్రి భీమా యోజన పథకంలో పైసలు వేస్తాం. తుఫాను లాంటి విపత్తులు వస్తాయి. పొలం నాశనమవుతుంది. అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా దొరకదు. ఫోన్లు చేస్తా ఉంటారు కానీ ఎవరు సమాధానం చెప్పరు . ఇంటర్ నెట్ నుంచి మెయిల్ పంపుతారు ..దానికి కూడా ఎలాంటి సమాధానం రాదు . ఇవన్నీ వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది.

ఇక్కడ మొర్బిలో ట్రాజిడీ జరిగింది. అప్పుడు విలేకరులు అడిగారు దీనికోసం ఎం చెప్తారు అని? .అప్పుడు నేను చెప్పాను చూడండీ … 150 మంది చనిపోయారు. ఇది రాజకీయం చేసే సమయం కాదు. దీనిమీద నేను స్పందించను.కానీ ఈ రోజు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరైతే ఈ పని చేశారో వాళ్లకు వ్యతిరేకంగా ఎలాంటి విచారణ జరగలేదు. కనీసం ఎఫ్ ఐ ఆర్ కూడా చెయ్యలేదు. బీజేపీ వాళ్లతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా సంబంధాలు ఉంటె వారికీ ఏం జరగదా? సంబంధం లేని వారిని పట్టుకున్నారు. లోపలవేశారు. కానీ ఎవరైతే నిజంగా తప్పు చేశారో , ఎవరైతే బాధ్యులో వాళ్లకు వ్యతిరేకంగా ఏమి లేదు.

ఈ గురజాత్ లో చిన్న మధ్య తరహా పరిశ్రమల కేంద్రం. ఏ యేపారిశ్రామాలు కేవలం గుజరాత్ లోనే కాదు దేశం మొత్తంలో నడిపిస్తున్నారు. ఇదే దేశానికి ఉపాధి . ఎవరైతే ఇద్దరు ముగ్గురు ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఉపాధి కల్పించడం లేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, మధ్య తరగతి వ్యాపారం ఉందొ, వాళ్ళు ఉపాధి కల్పించేవాళ్లు. ఏమైంది మరి … కేంద్రం నోట్లను రద్దు చేసింది. మీకు చెప్పాడు నల్లధనం నివారిద్దామని. నల్లడబ్బు నివారణ కాలేదు. కానీ అన్ని చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దీనికి తోడు జీ ఎస్ టి ఒకటి. అయిదు రకాల వేర్వేరు టాక్స్. ప్రతినెలా ఇంత మిగిలించుకుంటే అది కూడా ఐపోయింది. ధనవంతుల కోసం దారి క్లియర్ చేశారు. కొరోనా సమయంలో కూడా ఇదే చేశారు . నాకు బాగా గుర్తు. దేశంలో కార్మికులు , ఎవరో విలేకరి నన్ను అడిగారు మీరు నిజంగానే రెండువేల కిలోమీటర్లు నడిచారా? దేశంలో ప్రతి కార్మికులు రెండు వేళా కిలోమీటర్లు నడిచాడు. ఆకలితో నడిచాడు. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ కార్మికులకు ప్రభుత్వ సహా యం అవసరమైనప్పుడు ఈ దేశ ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం వాళ్లకు మద్దత్తు ఇవ్వలేదు. కార్మికులు రోడ్డు మీద చనిపోతుంటే అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ధనవంతులైన వారి లక్షల రూపాయలు మాఫీ చేసింది ఎవరైతే చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. మేము నాశనమైపోయాం నోట్ల రద్దు అయింది. తప్పుడు జీ ఎస్ టి అమలు చేస్తున్నారు. ఆ తరువాత కొరోనా వచ్చింది. ప్రభుత్వం మద్దత్తు చెయ్యలేదు. ఇవి పాలసీలు కాదు. నోట్ల రద్దు , జీఎస్టీ , కొరోనా సమయంలో వీళ్ళు అనుసరించిన తీరు పాలసీ కాదు. ఇది ప్రజలకు వ్యతరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, చిన్న చిన్న వ్యాపారులను చంపేసే ఆయుధం ఇది. ఈ దేశంలో ఉన్న ఇద్దరు ముగ్గురు ధనవంతులకు తెలుసు వాళ్ళ కోసం దారిని క్లియర్ చేసేఅయిదం ఇది. వాళ్ళు ఏ వ్యాపారం చెయ్యాలనుకున్న చేసేస్తారు. వాళ్ళు ఎం చెయ్యాలనుకుంటే అది చేసేస్తారు. టెలికం వ్యాపారం లోకి దూరుతారు, ఎయిర్ పోర్ట్ లో దూరుతారు, మౌలిక వసతులు, వ్యవసాయం ఇలా ఎం చెయ్యాలనుకుంటే అది చేసేస్తారు . గ్రాసరీ స్టోర్స్ ఇలా వాళ్ళు ఏ కళలు కన్నా వాళ్లకేం కాదు కానీ ఈ దేశంలో యువత కళలు కనాలంటే ముందుగా ప్రవితే కాలేజీలోకి వేళలండి లక్షలాది రూపాయలు కట్టానండి ధరలు చూడండీ.. ఆ తరువాత ఇంజనీయర్ చెయ్యొద్దు కూలీగా మారిపోండి. ఈ రోజు ఈ దేశంలో యువతకు ఉపాధి లభించడం లేదు .
75ఏళ్ళ దేశంలో అత్యంత ఎక్కువగా నిరుద్యోగం ఇప్పుడు ఉంది గుజరాత్ లో , దేశంలో కూడా.
గతంలో పేదవాళ్ళు ఉండేది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్లకు ఉపాధి లభించేది. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి. రైల్ వే కూడా ప్రైవేట్ చేశారు. . బి హెచ్ ఈ ఎల్ , ఆయిల్ కంపెనీలు, , ఇవన్నీ ఎవరికీ ఇస్తున్నారు. అదే ఇద్దరు ముగ్గురు ధనలక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక పక్క నిరుద్యోగం , మరో పక్క అధిక ధరలు .

యూపీఏ సమయంలో పెట్రోల్ 60 రూపాయలు ఉండే. ఈ రోజు వంద దాటిపోయింది. గ్యాస్ సిలెండర్ 400 ఉండే. ఈ రోజు ఎంత ? పదకొండు వందలు ఉంది. రెండు హిందూస్తాన్ దేశాలు సృష్టిస్తున్నారు. . ఒకడి ధనవంతులది. వాళ్ళు ఎం చెయ్యాలనుకుంటారో అది చేసేస్తారు . రెండోది పేద ప్రజల హిందూస్తాన్. రైతుల, కూలీల, చిన్న చిన్న వ్యాపారుల , మాకు రెండు హిందూస్తాన్ లు కాదు ఒకే హిందూస్తాన్ కావలి. న్యాయంతో ఉండే హిందూస్తా కావాలి

భారత్ జోడో మేము ఏదైతే మొదలు పెట్టామో , దాని వెనకాల ఆలోచన మీదే, గుజరాత్ ఆలోచనే, గాంధీ ఆలోచనే ఇది. మేమేమి కొత్త పని చెయ్యడం లేదు . దారి మాకు గుజరాత్ చూపించింది. మహాత్మ గాంధీ , సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపించారు . మీ దగ్గరే నేర్చుకున్న, మేం ఈ తపస్సు చేస్తున్నాము. ప్రజల మాటలు వింటున్న. ఆరేడు గంటల పాటు నడుస్తున్నాం.ఏమీ మాట్లాడం. రైతుల మాటలు , కష్టాలు వింటున్న, యువత మాటలు వింటున్న వారిని కౌగిలించుకుంటున్న. కూలీలతో మాట్లాడుతున్న. ఆరేడు గంటలు నడిచిన తరువాత , అప్పుడపుడు పది పదకొండు గంటలు కూడా అవుతాయి. కేవలం పదిహేను నిముషాలు మాత్రమే మాట్లాడుకుంటాం సాయంత్రం వేలా మీరందరు దూరప్రాంతాల నుంచి వచ్చారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. ఎంతో శ్రద్దగా ప్రేమతో నా మాటలు విన్నారు. దీనికోసం మీ అందరికి ధన్యవాదాలు. నమస్కారం , జై హింద్ . అని రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *