International

Ukraine War – కైవ్ లో అంధకారం

కైవ్ :
ఉక్రెయిన్ లోని పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరుస సమ్మెలతో పలు ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎల్విన్, ఒడెస్సా నగరాలతో పాటు కైవ్ నగరాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మాల్డో వాలో కూడా విద్యుత్ లేదని ఉక్రెయిన్ ఉప ప్రధాని వెల్లడించారు. ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థలో మూడు ప్రధాన పవర్ స్టేషన్ లను డిస్ కనెక్ట్ చేశారు. రష్యా గత కొంత కాలంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఉప ప్రధాని ఆరోపించారు. ఇప్పటికే సగం వరకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. కైవ్ నగరంలో రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *