International

US సూపర్ మార్కెట్ లో కాల్పులు – 6గురు మృతి -4గురికి గాయాలు

వర్జీనియా :
అమెరికా దేశం వర్జీనియా రాష్ట్రంలోని ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం రేపాయి. సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. వర్జీనియా రాష్ట్రం చీసాపీక్ లోని సూపర్ మార్కెట్ బ్రాంచ్ లో సహా ఉద్యోగులపై కిరాతకంగా కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. తరువాత కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అయితే సదరు కాల్పులు జరిపిన వ్యక్తి ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన పై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *