TELANGANA

ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ సీజ్

రాచకొండ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ సీజ్..

ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.యుఎస్,యూకే అబ్రాడ్ కు వెళ్ళే గ్రాడ్యువేషన్ సర్టిఫికెట్ లేని వారు.వీసా కోసం ఫేక్ సర్టిఫికెట్ లను అందిస్తున్నట్లు ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు చైతన్యపురి లో అరెస్ట్ చేశారు.దేశంలో పలు యూనివర్సిటీ ల ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ లను తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.వీరి నుండి ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్టీయూ,ఎన్ జి రంగా, ఆంధ్రా యూనివర్సిటీ,కాకతీయ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ,గుల్బర్గా యూనివర్సిటీ ఇలా 12 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన మిర్యాల ఆనంద్ కుమార్ వెబ్ డిజైనింగ్ నేర్చుకొని చింతలకుంట శక్తి నగర్ లో నివాసం ఉంటూ ఫ్లెక్స్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు.మలక్ పేటకు చెందిన మల్లెపాక హేమంత్ ల సహకారంతో ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసి విక్రయిస్తున్నారు.ఒక్కో సర్టిఫికెట్ కు 50 నుండి 60 వేలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు.కేసు ఇంకా విచారణలోఉందన్నారు.మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.గతంలో ఇలా ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిన వారిపై పిడి యాక్ట్ లు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *