ఇది యుద్ధం కాదు- విన్యాసాలు మాత్రమే !

అమెరికా
దక్షిణా చైనా సముద్ర తీరంలో అమెరికా , ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు జరుగాయి. అయితే ఇది యుద్ధం కోసం సంకేతాలు కావని, కేవలం విన్యాసాలు మాత్రమేనని అమెరికా ప్రకటించింది. చైనాతో తాము యుద్ధం కోరుకోవడం లేదని అమెరికా సైన్యాధికారులు పేర్కొన్నారు. తైవాన్ ను నిర్బంధించేందుకు జరిగిన రిహార్సల్స్ తరువాత కొద్దీ రోజులకే అమెరికా, ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు జరిగాయి. తైవాన్ విషయంలో చైనా చర్యలు సరైనవి కావని అమెరికా అభిప్రాయపడింది. తైవాన్ తమదని చైనా వాదిస్తోంది. అదే సమయంలో తైవాన్ స్వతంత్రతకు మద్దత్తు ఇస్తామని అమెరికా వెల్లడించింది. మొత్తంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో తైవాన్ ప్రజలు రెండు అగ్ర రాజ్యాల మధ్య చిక్కుకుపోయినట్టు అయింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest