ఈనెల 31న మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ నటించిన తెలుగు సినిమా తొలి కౌబాయ్ చిత్రం ” మోసగాళ్లకు మోసగాడు”. కృష్ణ చనిపోయిన తరువాత తొలిసారిగా ఈ నెల 31న మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రీలీజ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కృష్ణ కు నటుడిగాను మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో రీ రిలీజ్ సంస్కృతి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో మోసగాళ్లకు మోసగాడు సినిమాను మరోసారి విడుదల చేస్తున్నామని నిర్మాతా ఆదిశేషగిరిరావు చెప్పారు. కృష్ణ అభిమానులను ఈ సినిమా మరెంతగానో అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest