గ్రీన్‌కార్డుల జారీని సులభతరం చేసే బిల్లు

  • భారతీయులకు శుభవార్త

వాషింగ్టన్‌ :

పాలక డెమోక్రటిక్‌ పార్టీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన 2023 పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే లక్షలాది భారతీయులకు, మెక్సికన్లకు గొప్ప శుభవార్త అవుతుంది. గ్రీన్‌కార్డుల జారీకి దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనీ, హెచ్‌ 1బి వీసాలలో ముఖ్యమైన మార్పులు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. దేశాలవారీ కోటాల వల్ల మునుపటి సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన గ్రీన్‌కార్డులను వలసదారుల సంతానానికీ, భార్యలు లేదా భర్తలకు మంజూరు చేయడం ద్వారా వలసదారుల కుటుంబాలను ఏకం చేయాలని సిఫార్సు చేసింది. కుటుంబాల వలసకు దేశాలవారీ కోటాలను పెంచాలనీ ప్రతిపాదించింది. స్టెమ్‌ కోర్సుల్లో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి పీజీ డిగ్రీలు పొందినవారు అమెరికాలో ఉండిపోవడానికి వీలు కల్పించాలని కోరింది. హెచ్‌ 1బి వీసాదారుల కుటుంబికులకు ఇక్కడ పనిచేయడానికి అనుమతి ఇవ్వాలనీ ప్రతిపాదించింది. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలసవచ్చిన 1.1 కోట్లమందికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. వీరిలో వ్యవసాయ కూలీలూ ఉంటారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చినా పన్నులు సక్రమంగా చెల్లించినవారికి అయిదేళ్లలో పౌరసత్వం ఇవ్వాలని బిల్లు సూచిస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest