రాష్ట్రానికి కొనసాగుతోన్న పెట్టుబడుల ప్రవాహం

  • తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు
  • రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నారు
  • తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్ :

మంత్రి కేటీఆర్ అమెరికా టూర్​లో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా గ్రిడ్ డైనమిక్స్, ఔరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థలు తెలంగాణలో తమ సేవలను విస్తరించడానికి ముందుకొచ్చాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికా టూర్​ను విజయవంతంగా సాగిస్తున్న మంత్రి రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా తాజాగా హైదరాబాద్​లో డెలివరీ సెంటర్ విస్తరణను గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రకటించింది. డాటా సెంటర్ అభివృద్ధికి 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ కేటాయించింది.

అమెరికా నుంచి రాష్ట్రానికి వివిధ కంపెనీల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్​తో నేడు పలు సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్​లో డెలివరీ సెంటర్ విస్తరణను గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్​లో డాటా సెంటర్ అభివృద్ధికి 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ కేటాయించింది. తెలంగాణలో డాటా టెక్ స్టార్టప్ కోసం ఔరమ్ వెంచర్ పార్ట్‌నర్స్ సంస్థ ఐదు మిలియన్ డాలర్లు ప్రకటించింది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం కుదుర్చుకొంది. తక్కువ ధరలో పర్యావరణహిత వాహనాలను అందించే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల కోసం ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా జీరో ఎమిషన్ వాహనాల కోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయనున్నారు.

పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్​గా

ఇవేగాక ఇంకా ఎన్నో పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ అనేటట్లుగా మంత్రి కేటీఆర్ మార్చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పలు అంతర్జాతీయ సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు. ట్రావెల్‌ రంగంలో దిగ్గజ సంస్థ అయిన మాండీ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి గేర్లు ఉత్పత్తి చేసే రేవ్‌ గేర్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపింది. మొట్టమొదటి గ్లోబల్‌ డెవలప్​మెంట్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్టోరెబుల్‌ సంస్థ హైదరాబాద్‌లో తమ సేవలను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వంద మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను హైర్‌ చేసుకుని తమ సేవలను విస్తరించనుంది.

డిజిటల్‌ సొల్యూషన్స్‌ రంగంలో ప్రముఖమైనది రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ. ఇది తెలంగాణలోని ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 30న ఏర్పాటు చేయనున్న సంస్థ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.ఈ సంస్థ ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest