దివాలా గండం నుంచి గట్టెక్కిన అమెరికా

  • రుణ పరిమితి పెంపు బిల్లు పాస్

అమెరికా

అమెరికా గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుకు సెనెట్​ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ చేపట్టిన సెనెట్​ ఆమోదం తెలిపి అధ్యక్షుడి సంతకం కోసం పంపింది. దీంతో అగ్రరాజ్యం దివాలా గండం నుంచి గట్టెక్కినట్లైంది. అమెరికా రుణపరిమితిని పెంచేందుకు తీసుకువచ్చిన బిల్లుకు సెనెట్​ ఆమోదం తెలిపింది. గడుపు సమీపిస్తున్న వేళ దీనిపై చర్చ చేపట్టింది సెనెట్. అనంతరం ఆమోదం తెలిపి అధ్యక్షడు జో బైడెన్​ అనుమతి కోసం పంపింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు జోబైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. ఈ బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైంది. రెండు పార్టీలకు చెందిన మోజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. 314- 117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 165-46 ఓట్ల తేడాతో డెమొక్రాట్‌లు మద్దతు ఇవ్వగా, 149-71 ఓట్లతో రిపబ్లికన్లు మద్దతు ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest