ODI World Cup 2023 షెడ్యూల్ ఇదే

ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) టైటిల్‌ కోసం బరిలోకి దిగే పది జట్లు తేలిపోయాయి. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ టాప్‌-8లో ఉన్నాయి. ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్‌ టాప్‌-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లతోనే అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పది జట్లు సిద్ధమైపోయాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల వివరాలకు సంబంధించి తాజా అప్‌డేట్ మీ కోసం..

భారత్‌ X ఆస్ట్రేలియా : అక్టోబర్ 8, చెన్నై
భారత్ X అఫ్గానిస్థాన్‌ : అక్టోబర్ 11, దిల్లీ
భారత్ X పాకిస్థాన్ : అక్టోబర్ 15, అహ్మదాబాద్
భారత్ X బంగ్లాదేశ్‌ : అక్టోబర్ 19, పుణె
భారత్ X న్యూజిలాండ్ : అక్టోబర్ 22, ధర్మశాల
భారత్ X ఇంగ్లాండ్ : అక్టోబర్ 29, లఖ్‌నవూ
భారత్ X శ్రీలంక: నవంబర్‌ 2, ముంబయి
భారత్ X దక్షిణాఫ్రికా: నవంబర్ 5, కోల్‌కతా
భారత్ X నెదర్లాండ్స్‌ : నవంబర్ 11, బెంగళూరు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest