అమెరికాలో 19అడుగుల అంబేద్కర్ విగ్రహం

అమెరికా :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికా లో ఆవిష్కరించనున్నారు. మేరీ లాండ్ లోని అకోకిక్ నగరంలో 19అడుగులు ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని 13ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం (ఏ ఐ సి) వెల్లడించింది. సమానత్వానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపింది. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చెక్కిన శిల్పి రామ్ సితార్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రోపొందించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest