అయిదు రాష్ట్రాల్లో టోర్నడోలు విధ్వంసం

టెక్సాస్ : అమెరికాలోని అయిదు రాష్ట్రాల్లో టోర్నడోలు విధ్వంసం సృష్టించింది. తీవ్రమైన గాలులు వ్యాపించడంతో పలు వందలాది ఇల్లు ధ్వంసం అయ్యాయి. సుమారు ఎనభై మూడు చోట్ల టోర్నడోలు సంభవించింది. శక్తివంతమైన తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖా తెలిపింది. పలువురికి గాయాలు అయ్యాయి. ఓక్లా హోమ్ లోని హ్యూస్ కౌంటీలో హెల్డెన్ విల్లెలో తుఫాను కారణంగా ఒకరు చనిపోయినట్టు సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. టెక్సాస్ నుంచి ఐయోవా ప్రాంతం వరకు ఆరు రాష్ట్రాలలో విపరీతమైన గాలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన గాలులు సంభవించాయి. మూడు అంగుళాల వ్యాసం కలిగిన వడగాలులు వచ్చినట్టు వాతావరణ శాఖా పేర్కొంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest