International

ఇండియా ను మెచ్చుకున్న పాక్ ప్రధాని

 

ఇస్లామాబాద్:

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు ఇండియా కు మంచి చేస్తున్నాయన్నారు. దేశ పౌరుల కోసం ఇండియా ఎంతకైనా తెగిస్తుందని, ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా ఇండియా ఉంటుందన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ వేళ తటస్థ వైఖరి పాటిస్తూ అమెరికాతో సంబంధాలు కాపాడుకుంటూనే రష్యా నుంచి ముడిచమురు తక్కువ ధరకు కొనుగోలు చేశారని ఇమ్రాన్ ప్రశంసించారు. అదే సమయంలో ఇండియన్ ఆర్మీపై ఇమ్రాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వంలో ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకోదన్నారు. పాక్ ఆర్మీకి డబ్బులిచ్చి తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేనని చెప్పి కలకలం రేపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *