AIFB జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన రాములు యాదవ్

  • ఏ ఐ ఎఫ్ బీ పార్టీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.
  • అదానీ అక్రమాలపై జేపీ సీతో విచారణ చేపట్టాలని డిమాండ్

హైదరాబాద్

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (aifb) పార్టీ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, బీ. రాములు యాదవ్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలువునిచ్చారు. బుధవారం ఆయన స్థానిక LB నగర్ నియోజకవర్గం పార్టీ ఉపాధ్యక్షురాలు తల్లూరి విజయలక్ష్మి AIFB నియోజకవర్గ నాయకులు మహమ్మద్ ఆఫీస్. అబ్దుల్ శ్రీకాంత్ .ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా LB నగర్ నియోజకవర్గం మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు యాదవ్ మాట్లాడుతూ, దేశం నలుమూలాల నుంచి పార్టీ నేతలు మహాసభలకు తరలివస్తున్నారని తెలిపారు. దేశానికి దిక్సూచిగా నిలిచేలా మహాసభ కొనసాగనున్నదని చెప్పారు.

అదానీ అక్రమాలపై మోదీ బాధ్యత వహించాలి :రాములు యాదవ్

ఆర్థిక నేరగాళ్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ అదానీ అక్రమల పై బాధ్యత వహించాలని రాములు యాదవ్ డిమాండ్ చేశారు. వెంటనే అదానీ కుంభకోణంపై జేపీసీని నియమించి విచారణ చేపట్టాలని కోరారు. ప్రజలకు చెందాల్సిన దేశ సంపదను దిగమింగి, అవినీతికి పాల్పడుతూ ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో వ్యక్తిగా నిలవటం సిగ్గుచేటుకరమన్నారు. ఆదానీ కంపెనీల అక్రమాలపై హిడెన్ బర్గ్ సంస్థ నివేదిక వెలువడే వరకు ఈడీకి సోయి లేదా అని ప్రశ్నించారు. ఆదానీ కుంభకోణంతో దేశ ప్రతిష్ట దిగజారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే అధికారం మోడీకి ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అదా నినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest