అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేల ఆటంకం

  • మంత్రి అంబటి రాంబాబు

అమరావతి.
శాసన సభ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రోజు సభకు రావడం సస్పెండ్ అయి వెళ్లిపోవడం నిత్య కృత్యం అయింది.శాసన సభలో టీడీపీ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరించింది.టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు సమయం కేటాయించింది.వైసీపీ ఎమ్మెల్యేల తో బేరసారాలు ఆడి నలుగురు వస్తారని తెలిసి అభ్యర్థిని పోటీలో పెట్టారు.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను కొంటు అడ్డంగా దొరికారు.ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటారని మాకు తెలుసు.నలుగురు ఎమ్మెల్యేలు కొని ఎమ్మెల్సీ గెలిపించుకుంటే టీడీపీ బాహుబలి పార్టీ అవుతుందా?టీడీపీ కుట్రలు చేసి గెలిచింది. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేల తో ఎమ్మెల్సీ గెలిచి సునకానదం పొందుతున్నారని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest