గుంటూరు
ఆంధ్రప్రదేశ్ లో (22-02-2023) పర్యటించనున్న “ఏపీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ‘
– ఉదయం 9గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రాక
– *గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో జరిగే భూమి పూజ మహోత్సవ శుభకార్యక్రమంలో పాల్గొననున్న ‘ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ ‘ – *గుంటూరులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం
బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యకుడు డాక్టర్ తోట లో చంద్రశేఖర్. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ముందుగా గన్నవరం విమానాశ్రయానికి తొమ్మిది* గంటలకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు* . అనంతరం అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ,* కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం , ఉండవల్లి గ్రామంలోని దేవుని మాన్యం, పంట కాలువ ప్రక్కన ‘ శ్రీ గంగా బాలత్రిపురసుందరీదేవి సమేత భీమలింగేశ్వరస్వామి’ వారి దివ్య ఆశీస్సులతో …. ‘ శ్రీశ్రీశ్రీ మహా మృత్యుంజయ జప ( దోష ) విశ్వశాంతి మహాయాగం ‘ కు సంబంధించిన ‘ భూమి పూజ ‘ *కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ తోట చంద్రశేఖర్ పాల్గొంటారు.
ఆ తర్వాత గుంటూరులో ఆయన బస చేయనున్నారు . గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో డాక్టర్ తోట చంద్రశేఖర్ సమావేశమయ్యే అవకాశం ఉంది . పార్టీలో చేరికలు, తాజా* రాజకీయ పరిణామాలు సహా పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం .