అమరావతి:
ఎపి సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేది నుంచి నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఇందుకు సంబంధించిన పరీక్షల, ఫీజు షెడ్యూల్ మంగళవారం విడుల చేశారు.
ఏప్రిల్ 3 వ తేది నుంచి 17వ తేది వరకు జరుగుతాయని వెల్లడించారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఏప్రిల్ 18 నుంచి 23వ తేది వరకు మధ్యాహ్నం రెండు పూటలలో ఉంటాయని తెలిపారు.
పరీక్ష ఫీజును ఫిబ్రవరి 1 నుంచి 15వ తేది వరకు ఎపిఆన్‌లైన్ ద్వారా గానీ, నేరుగా గానీ చెల్లించవ్చునని వివరించారు. ఫిబ్రవరి 16 నుంచి 22 వరకు అపరాధ రుసుం రూ.25లతో చెల్లించవచ్చునని, రూ.50ల రుసుంతో మార్చి 2వ తేది వరకు చెల్లించవచ్చునని తెలిపారు. ఇంటర్మీడియట్ తత్కాల్ రుసుం రూ.1000లు, పదవ తరగతికి రూ.500గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్ధులు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చునని తెలిపారు.