తిరుపతి:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్ గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలంగాణ విభజన జరగనివ్వకుండా చూస్తానని గొప్పలు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. 2014 ఎన్నికల సమయంలో సమైఖ్యఆంధ్ర పార్టీని స్థాపించారు. ఆయనకు అప్పుడు చెప్పుల గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తరువాత సోనియా గాంధీని , రాహుల్ గాంధీని కూడా కలిసినప్పటికీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన కీలకంగా పని చేసిన దాఖలాలు లేవు. అయితే తాజాగా ఆయన రాజీనామాతో బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Post Views: 55