అమరావతి:
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా వచ్చిన మాజీ జెస్టిస్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో చేరుకున్న కొత్త గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికారు. విశ్వా భూషణ్ హరిచందన స్థానంలో అబ్దుల్ నజీర్ ను ఏపీ గవర్నర్ గా రాష్ట్రపతి ఇటీవల నియమించిన విషయం తెలిసిందే.విశ్వ భూషణ్ కు జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు. అంతేకాదు విశ్వభూషణ్ వెళ్లిపోతున్న సమయంలో జగన్ ఆయన కళ్ళకు మొక్కారు.