గుంటూరు
గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో పన్ను వసూళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 9.22 కోట్లు వసూళ్లు అయ్యాయి. మార్చి నెల 31వ తేదీ ఒక్కరోజే 9.22 కోట్లతో కార్పొరేషన్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. నగరంలో 1.92 లక్షల అసెస్మెంట్లకు గానూ రూ.146 కోట్లకు డిమాండ్ వుండగా ఇప్పటి వరకు రూ. 114 కోట్లు వసూళ్లు చేశారు. పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించిన వారికి కమిషనర్ కీర్తి ధన్యవాదములు తెలిపారు.