జనాలు కరువై లోకేష్‌ పాదయాత్ర ఎత్తిపోయింది..!

 

●తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సంక్షేమ యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌..!

●ఇందులో పదోవంతు కూడా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనడం లేదు..!

●రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు..!

●కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సంక్షేమ యాత్రకు సంఘీభావం తెలిపిన తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి..!

తాడిపత్రి

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తామని తప్పుడు సర్వేలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తుంటే నారా లోకేష్‌ ఆ పార్టీకి పాడె కట్టేశాడు. ఆయన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ‘పాడెయాత్ర’లా మారిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపప్పూరు మండలంలో జరుగుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సంక్షేమ యాత్రకు బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలను పార్టీ శ్రేణులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్‌ పాదయాత్ర వెలవెల పోతుంటే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌. సూపర్‌ హిట్‌ అవుతోంది. వేలాది మందితో పెద్దారెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ యాత్ర వైఎస్సార్‌సీపీ బలాన్ని చాటిచెప్పేలా ఉంది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న పాదయాత్రలో వేలాదిమంది పాల్గొంటున్నారంటే ఆ ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ, పార్టీ పట్ల ఉన్న ప్రేమ, ఆ పార్టీ అధినాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డిపై ఉన్న అభిమానానికి అద్దం పడుతోంది. అదే రాష్ట్ర నాయకుడు, జాతీయ నాయకుడు అని చెప్పుకునే లోకేష్‌ పాదయాత్రలో ఆయన వెంట కనీసం వందమంది కూడా నడవని పరిస్థితి. దీన్నిబట్టి చూస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు కొడుకుకే జనం కరువైతే టిడిపి శ్రేణుల్లో ఎలాంటి ఆత్మవిశ్వాసం నింపుతారు. లోకేష్‌ పాదయాత్రతో ఆ పార్టీ కార్యకర్తల్లో పూర్తి నిరుత్సాహం కలిగింది. ప్రతిపక్ష పార్టీకి అంతోఇంతో ఆదరణ పెరుగుతుందని ఆశ పెట్టుకున్న∙నాయకులంతా నిరుత్సాహంతో ఇళ్లకు పరిమితమయ్యారు. జిల్లా నుంచి నాయకులు వెళ్లి సంఘీభావం తెలుపుతున్నల్లు కనిపించలేదు. పాదయాత్ర ఎత్తిపోయింది. పెద్దారెడ్డి పాదయాత్రతో పోలిస్తే∙లోకేష్‌ పాదయాత్ర దిగదుడుపే. పెద్దారెడ్డి పాదయాత్రలో పదోవంతు కూడా లోకేష్‌ పాదయాత్రలో జనాలు లేరంటే ఇక టిడిపి ఎక్కడుంది.

👉కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకంటే చిన్న వాళ్లను కూడా అన్నా అంటూ గౌరవంగా సంబోధిస్తాడు. అందరినీ కలుపుకొనిపోయే మాస్‌ లీడర్‌. ఈ నియోజకవర్గంలో గత మూడున్నరేళ్లలో ఎలాంటి ఫ్యాక్షన్‌ లేకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. పోయిన కాలాలన్నీ కూడా చెడిపోయిన కాలాలు. ఎంతో రక్తపాతానికి గురైన ఈ ప్రాంతంలో శాంతికుసుమాలు పూయించడంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పాత్ర అభినందనీయనం.

👉తెలుగుదేశం పార్టీ తరుఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే కమ్యూనిస్టులు, జనసేన నాయకులు ఒకటే గుర్తించుకోవాలి. ప్రజలు సుపరిపాలనకు పక్షపాతం వహిస్తారు. జగనన్న పట్ల ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తున్నారు. జగనన్న అమలు చేస్తున్న పథకాలన్నీ రద్దు చేస్తారని, సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను రద్దు చేసి మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు లోకేష్‌ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్లు తెరవాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest