ఢిల్లీ
టిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డా తళుక్కుమన్నారు. టిడిపి ఆవిర్భావ వేడుకలపై జెపి నడ్డా హర్షం వ్యక్తం చేశారు.
పార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్టీ ఆవిర్భావ వేడుకలను టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల కలిసి జరుపుకున్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఇతర పార్టీల ఎంపీలకు తినిపిచ్చారు. ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న జెపి నడ్డాటిడిపి ఎంపీలకు అభినందనలను తెలియజేశారు. వాజ్ పేయి, ఎన్ డి ఏ హయాంలో టిడిపి- బిజెపి అనుబంధాన్ని జెపి నడ్డాకు ఎంపీ కనకమేడల వివరించారు. టిడిపితో స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసన్న జెపి నడ్డా సమాధానం ఇచ్చారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తుపైనా కూడా తాను ట్వీట్ చేశానని నడ్డా అన్నారు.
