దుర్గమ్మ పాలకమండలి పరిచయ సమావేశం

విజయవాడ:

బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి మీటింగ్ హాలులో ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు. సమావేశం నందు పలు అంశములపై చర్చించారు. ఈనెల 7 న గ్రామాంతరం ఉండటం చేత హాజరు కాలేకపోయిన కోలుకులూరి రామ సీత శుక్రవారం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ ఆలయ పాలకమండలి సభ్యులుగా నియమింపబడటం ఎన్నో జన్మల పుణ్యఫలమని, తమకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సేవకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపి, భక్తులు, ఆలయ అధికారులతో సమన్వయంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు భాద్యతలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కేసరి నాగమణి, కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవికృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నంబూరి రవి గారు, చింకా శ్రీనివాస రావు, కొలుకులూరి రామ సీత, అల్లూరి కృష్ణవేణి, తోట్టడి వేదకుమారి, కార్యనిర్వాహక ఇంజినీర్లు కోటేశ్వర రావు, ఎల్. రమాదేవి , సహాయ కార్యనిర్వాహణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest