దేశాన్ని దివాళా తీస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

 

  • ఈస్ట్ ఇండియా కంపెనీలాగ దేశాన్ని దోచుకుంటున్న గౌతమ్ అదానీ
  • అదానీ భాగవతాన్ని బయటపెట్టిన హిడెన్ బర్గ్ నివేదిక
  • అదానీ ఆర్ధిక కుంభకోణాలపై రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు
  • ఈనెల 13న వేలమంది కాంగ్రెస్ శ్రేణుల చలో రాజ్ భవన్
  • అదానీ కి అండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ
  • ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

విజయవాడ :

దేశఆర్ధిక సంపదను కొల్లగొడుతున్న గౌతమ్ అదానీ కి అండగా భారత దేశ ప్రధాని నరేంద్రమోడీ , బీజేపీ పార్టీ నిలుస్తోందని, దేశంలోని పోర్టులు , ఎయిర్ పోర్టులు , గ్యాస్ , గ్రీన్ ఎనర్జీ , మైనింగ్ ,ఇంధన రంగాలన్నింటిని ప్రధాని నరేంద్ర మోడీ అదానీ పాదాల చెంత పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్రంగా విమర్శించారు. నందిగామలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమములో అయన మాట్లాడుతూ ప్రజలు జీవిత భీమా కింద దాచుకున్న 90వేల కోట్లరూపాయల డబ్బును ఎల్ ఐ సి అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ప్రజల జీవితబీమా పై నీళ్లు జల్లిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా షుమారు 80వేల కోట్ల ధనాన్ని అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని ఆరోపించారు. హిడెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల భగవతం బయట పడింది అని అన్నారు. సెల్ కంపెనీలు సృష్టించి వాటిల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టించి దోచుకొని దేశ ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయించే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ లాంటి వ్యక్తులకు ధారాదత్తం చేయటంలో బీజేపీ పార్టీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోడీకుడా ఎప్పటికప్పుడు అండ దండలు అందిస్తూ దేశాన్ని దివాళా తీస్తున్నారని విమర్శించారు.ఒక్కపుడు సామాన్యుడిగా ఉన్నటువంటి గౌతమ్ అదానీ నేడు ప్రముఖ పరిశ్రామిక వేత్తతో రెండోవాడిగా నివడానికి మోడీనే కారణమని ఆరోపించారు. అదానీ పార్లమెంట్ ప్రకంపించినప్పటికీ మోడీలో ఎటువంటి చలనం కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదానీ కి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ , బీజేపీ పార్టీ అగ్రనేతల బండారం బయట పెట్టడానికి వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించాలని డిమాండ్ చేసారు. అదానీ కి చెందిన డొల్ల కంపెనీల షేర్లు పడిపోవటం ద్వారా ఆయా కంపెనీల షేర్లు పడిపోయాయని దింతో వేలకోట్ల రూపాయల నష్టాలూ మిగిలాయని ఆరోపించారు. అదానీ ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించే అందుకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అందుకోసం ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈనెల 13న చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నామని అన్నారు. నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున్న పాల్గొనాలని గిడుగు రుద్రరాజు పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest