పీజీ విద్యార్థిని ఆత్మహత్య

 

విశాఖపట్నం

విద్యార్థిని మాధురి, తను చదువుతున్న కాలేజి హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.మాధురి ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని జ్ఞానాపురం సెయింట్ జోసఫ్ కాలేజీ స్టూడెంట్ గా గుర్తించారు. అయితే ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదనే విషయం తెలియాల్సి ఉంది.విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి పోలీసులు తరలించారు. ఐదో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest