పొట్టకూటి కోసం జనం వలసలు వెళ్లిపోతున్నా…!

విజయనగరం

ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, పొట్టకూటి కోసం జనం వలసలు వెళ్లిపోతున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలు ఇక్కడ సమస్య ల పై పార్లమెంటులో గానీ సంబంధిత మంత్రులను గానీ కలిసే దాఖలాలు లేవు అని చెప్పారు. దీనిపై ఎన్నికల తరువాత బహిరంగ చర్చకు మేము సిద్ధమని అన్నారు. అనేక వనరులు ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతం నుంచి ఎన్నికోబడినా ప్రయోజనం మాత్రం శూన్యమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ గతంలో అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవడంతో ఈ ప్రాంతం తమకు కంచుకోటగా చెప్పుకుందని అన్నారు. వేవ్ లో గెలిపొందిన వైసీపీ తమకు కంచుకోటగా చెప్పుకుంటున్నాయని, కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీ తోనే సాధ్యం అవుతుందని అన్నారు. అందుకే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలిపించాలని ఆయన కోరారు.మాకు ఇక్కడ ఒక్క సీటు కూడా లేదు.ఈసారి అవకాశం ఇస్తే దీ‌నిని ప్రధాన‌ మంత్రి కి చూపించి అభివృద్ధి వేస్తాం.చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారు, ఇది దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest